Featured

Senior Actor Varalakshmi : వరలక్ష్మి గారి లవ్ స్టోరీ… భర్త ఎవరు, ఏం చేస్తారు.. అన్నపూర్ణమ్మతో ఉన్న రిలేషన్… గాజు ముక్క దిగి ఒళ్ళంతా గాయాలు… ఆస్తులు ఎన్ని కోట్లంటే…!

Senior Actor Varalakshmi : పాత నాగేశ్వరావు గారి సినిమా ‘అందాల రాముడు’ తో ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బేబీ వరలక్ష్మి గా ఫేమస్ అయిన నటి వరలక్ష్మి. కొన్ని వందల సినిమాలలో బాల నటిగా చేసిన వరలక్ష్మి ఆపై హీరోలకు చెల్లిగా కూడా ఎక్కువ సినిమాలలో నటించారు. ఎక్కువగా కృష్ణ గారికి చెల్లిగా నటించి నిజంగానే ఆయన చెల్లి అనేలా ఒదిగిపోయి నటించారు. ఇక ఆ తరువాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలకు చెల్లిగా నటించిన వరలక్ష్మిగారు పెళ్లి అయ్యాక పాప పుట్టిన తరువాత సినిమాలను తగ్గించి సీరియల్స్ ను చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి కొంత దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ మాట్లాడిన వరలక్ష్మి గారు తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.

పెళ్లి, అన్నపూర్ణమ్మ బంధువు ఎలా అంటే…

కెరీర్ లో బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే వరలక్ష్మి గారు 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. తండ్రి 18 ఏళ్లకి మరణించడంతో ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళని వరలక్ష్మి గారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కేరళకు చెందిన విశ్వనాధ్ అనే డాక్టర్ వరలక్ష్మి గారిని మ్యాగజైన్ లో ఫోటో చూసి ప్రపోజ్ చేశారట. ఇక ఆయనతో పెళ్ళికి ఒప్పించి చేసుకున్నారట. పెళ్లి అయ్యాక కూడా నటించడానికి భర్త నుండి అభ్యంతరం లేకపోయినా పాప పుట్టాక ఇక నటించరాదని పాపకు సమయం కేటాయించాలని అనుకుని సినిమాలను తగ్గించి సీరియల్స్ లో చేశారట వరలక్ష్మి.

ఇక వరలక్ష్మి గారికి ఒక అక్క ఇద్దరు చెల్లెల్లు అందులో అక్క భర్త సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు అవ్వడం వల్ల ఆమె రిలేటివ్ అంటూ చెప్పారు. ఇక చాలా సినిమాల్లో చెల్లి పాత్రలు చేసిన సమయంలో రేప్ సీన్స్ లో బాగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఒళ్ళంతా గాయలతో కొన్నిసార్లు ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఇక ఒక సీన్ లో రేప్ చేసి చంపేస్తే విజయ నిర్మల గారు చనిపోయిన నా శవం మీద పడి ఏడ్చే సీన్ లో ఆమె నా చేయి మీద పడినపుడు గాజు గుచ్చుకుని బాగా రక్తం వచ్చింది. కానీ సీన్ అయిపోయే వరకు తట్టుకుని షాట్ అయ్యాక నొప్పి అంటూ అరిచాను. అలా ఎన్నో సినిమాల్లో గాయాలు తప్పలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago