Senior actress Jhansi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన అలనాటి నటి ఝాన్సీ. బాపు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఝాన్సీ గారు తల్లి పాత్రలతో ఎక్కువగా మెప్పించారు. ఎక్కువగా ఎన్టీఆర్ గారితోనూ, ఏఎన్ఆర్ తోనూ అప్పటి అగ్ర హీరోలందరితోనూ ఎన్నో సినీమాల్లో నటించిన ఆమె ఈ తరం వారికి గుర్తు రావాలంటే మాత్రం మనవూరి పాండవులు, పెళ్లి పుస్తకం, శంకరాభరణం వంటి సినిమాల్లో నటించిన ఝాన్సీ గారిని చూడవచ్చు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆర్థికంగా బాగా సంపాదించుకున్నా నేడు ఒక చిన్నగదిలో కాలం వెళ్ళదీస్తున్నారు ఝాన్సీ.
ఝాన్సీ గారి భర్త… ఆస్తులు ఎలా పోయాయాంటే…
కొన్ని వందల సినిమాల్లో నటించిన ఝాన్సీ గారు ఆస్తులను బాగా సంపాదించారు. సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ మరో వైపు సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదించిన ఝాన్సీ గారికి ఆమె భర్త ఒక సినిమాకు ఫైనాన్స్ చేసినపుడు ఆయన పార్టనర్ అవడంతో అలా పరిచయం ఏర్పడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. భర్త కెమికల్ ఫీల్డ్ లో పనిచేస్తారంటూ ఇండస్ట్రీకి సంబంధిచిన వ్యక్తి కాదని తెలిపారు ఝాన్సీ. సినిమా నిర్మాణంలోకి వెళ్ళకండి అని చాలా మందికి సలహాలు ఇచ్చేవారట ఝాన్సీ గారు.
కానీ ఆవిడే చివరికి సినిమా నిర్మాణంలోకి వచ్చి సుమన్ హీరోగా ‘ఖైదీ ఇన్స్పెక్టర్’ అనే సినిమాను తీశారు. ఆ సినిమాతో బాగా నష్టపోయిన ఆవిడ భర్త మరణించడం, పిల్లలు ఇంకా పెద్దవాళ్లు కాకపోవడం, బాధ్యతలు తన మీదే ఉండటం వల్ల ఉన్న ఆస్తులను అమ్మి అప్పులు లేకుండా చేసుకోవాలని భావించి ఆస్తి పోగొట్టుకున్నారు. చివరికి పిల్లలు సెటిల్ అయి, పెళ్లిళ్లు చేసుకుని ఎవరి దారి వారు చూసుకోవడంతో ఝాన్సీ వారి నిరాధరణకు గురై చిన్న గదిలో ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…