Senior Actress KR Vijaya : దేవత పాత్రలు అనగానే ఒక్కప్పటి సినిమాల్లో గుర్తు వచ్చేది కేఆర్ విజయ గారు. ఆమె పెద్ధ కళ్ళు అందమైన ముఖ వర్చస్సు వల్ల అమ్మవారి రూపంలో చక్కగా కనిపించేవారు. ఇక హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో మొదటగా ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాతో గుర్తింవు తెచ్చుకున్న ఆమె తమిళంలో తన కెరీర్ మొదలు పెట్టారు. ఇక కేరళకు చెందిన ఈమె తండ్రిది మాత్రం చిత్తూరు జిల్లా కావడం విశేషం. ఇక తెలుగులో వందకు పైగా సినిమాలలో నటించిన విజయగారు ఎక్కువగా తమిళంలోనూ ఆపైన తెలుగు, మలయాళంలో నటించారు. ఆమె వ్యక్తిగత విషయాలను అలాగే కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆమె నా కూతురు కాదు…
రాజేంద్ర ప్రసాద్ నటించిన గోల్ మాల్ గోవిందం అలాగే ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ అనూష విజయ గారి కూతురుగా అందరికీ తెలుసు. కానీ నిజానికి విజయ గారికి ఒకే కూతురు ఆమె కూడా అనూష కాదు, హేమలత. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయ గారే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
అనూష కేఆర్ విజయ గారి చెల్లెలు కేఆర్ సావిత్రి గారి కూతురు. అంటే విజయ గారి చెల్లి కూతరు కానీ అందరూ విజయ గారి కూతురే అని అనుకున్నారు. అనూష రెండు తెలుగు సినిమాల్లో చేసినా ఆపైన నిన్నేపెళ్లాడతా, జయం వంటి సీరియల్స్ లో నటించి మరింత మంచి పేరు తెచ్చుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…