Senoir Actress: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయాలను స్వయంగా సదరు నటీమణులు బహిరంగంగా వెల్లడించారు.
తాజాగా మరొక సీనియర్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…ఏక్ థా దిల్ ఏక్ థీ దడ్కన్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో కూడా ఈమె నాగార్జున సరసన చంద్రలేఖ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సందడి చేశారు.
ఇలా ఇండస్ట్రీలో సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక సీనియర్ నిర్మాత తనకు ఫోన్ చేసి ఒక హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారు. మీరు ఆ హీరోకి ఫోన్ చేసి కలవండి అని అతని ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆ హీరో కి ఫోన్ చేస్తే అతను నా స్టాఫ్ లేకుండా ఒంటరిగా నన్ను కలవమని చెప్పారు. ఇలా ఆ హీరో ఒంటరిగా రమ్మనే సరికి ఒక్కసారిగా గుండె ముక్కలైంది. విషయం అర్ధమయ్యి ఆ నిర్మాతను పిలిచి నా అందం, పని తనం వల్లే ఇక్కడి వరకు వచ్చాను. ఒక అవకాశం కోసం దిగజారిపోతానని ఎలా అనుకున్నావు అంటూ అతనిని గట్టిగా నిలదీశాను. దీంతో అతను తన సినిమా నుంచి నన్ను తప్పించారు అంటూ ఈ సందర్భంగా ఇషా కొప్పికర్ కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…