Senior Artist P.R. Varalakshmi : నగరి కి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు ‘కృష్ణావతారం’ సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరు హీరోలతో నటించిన ఆమె మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా తరువాత తరం వారితోనూ నటించారు. తమిళంలో సీరియల్స్ లో నటిస్తున్న వరలక్ష్మి గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోలేదు… అందుకే కోపం…
తెలుగు ఆర్టిస్ట్ అయిన వరలక్ష్మి గారు వందల సినిమాల్లో నటించారు. అయితే తెలుగులోనే ఎక్కువగా నటించినా కూడా అక్కడ ఆదరణ లేదంటూ చెప్పారు. ఆమె ప్రస్తుతం చెన్నై లో నివసిస్తున్నారు. తన ఇంట్లో కూడా కేవలం తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుండి వచ్చిన అవార్డులను షీల్డ్ లను మాత్రమే ఉంచి తెలుగుకు సంబందించిన అవార్డులను షీల్డ్ లను తీసేసారు.
తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోలేదని తెలుగు ఆర్టిస్ట్ అయినా కూడా నన్ను అసలు పట్టించుకోలేదని అందుకే నాకు కోపం అంటూ పి ఆర్ వరలక్ష్మి గారు తెలిపారు. తమ తాతలు, తండ్రుల దగ్గరి నుండి అందరూ తెలుగు నేలకు ఎంతో సేవ చేసినా నన్ను తెలుగు ఆర్టిస్ట్ గా గుర్తు పెట్టుకోలేదనే బాధ ఉంది కానీ తమిళ ఇండస్ట్రీ నన్ను అక్కున చేర్చుకుంది, ఇప్పటికీ సీరియల్స్ లో బిజీగా ఉన్నాను. సినిమాలను నేనే అవుట్ డోర్ వెళ్లాల్సి ఉంటుందని వద్దని భావించి చేయడం లేదు అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…