Featured

Senior heroine Vanisri : వాణిశ్రీ హై స్కూల్ కి ఆ పేరు పెట్టడానికి గల కారణం… పేరు పెట్టడానికి వాణిశ్రీ పెట్టినా కండిషన్స్ ఇవే….!

Senior heroine Vanisree : నెల్లూరుకి చెందిన రత్నకుమారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ. తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది వాణిశ్రీ. కేవలం సినిమాల్లోనే కాకుండా అటు రాజకీయాల్లోను ఎన్టీఆర్ గారి ప్రొద్భలంతో వచ్చిన వాణిశ్రీ అక్కడ ప్రజలకు సేవలాందించారు. ఇక ఆమె పేరున ఏకంగా ఒక స్కూల్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.

వాణిశ్రీ సహాయంతో ఊర్లో పాఠశాల….

పాముదుల దస్తరామయ్య అనే కమ్యూనిస్ట్ నాయకుడు సౌత్ మోర్పూర్ గ్రామం నెల్లూరు జిల్లాకు చెందిన వారు. వారి గ్రామంలో హై స్కూల్ లేని కారణంగా ఎంతోమంది పిల్లలు ప్రాథమిక చదువు వద్ద బడికి పోవడం ఆపేస్తున్నారని అలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటుకు లక్ష రూపాయాలు అందిస్తాం కానీ ముందు ముపై మూడు వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఊరిలో సమావేశం ఏర్పాటు చేసి నిధులను ఎలా సేకరించాలని ఆలోచించారు. ఇక సినిమా వాళ్లను ఎవరినైనా చందాలు అడిగితే అని అలోచించి హీరోయిన్ వాణిశ్రీ బందువు ఒక అబ్బాయి వాళ్ళ ఊరిలో ఉన్నాడని తెలిసీ అతని ద్వారా ఆమెను కలిసి మా ఊర్లో ఒక డాన్స్ పెరఫార్మెన్స్ ఇవ్వండి దానివల్ల వచ్చిన డబ్బు తో స్కూల్ కోసం వాడుకుంటామని అడిగారు.

అయితే వాణిశ్రీ గారు నా డాన్స్ ప్రోగ్రమ్ పెట్టించడానికి మీకు అయ్యే ఖర్చు అవన్నీ భరించడం కన్న స్కూల్ రావడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి ఆ డబ్బు నేనే ఇస్తాను అని చెప్పి మొదట పదివేలు చెక్ ఇచ్చి అయితే స్కూల్ కి తన పేరు వచ్చేలా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పారట. గ్రామస్థులంతా కలిసి చర్చించుకుని ఆమె ఇంత డబ్బు ఇస్తున్నపుడు స్కూల్ కి ఆమె పేరు పెట్టడం సమంజసం అనిపించింది అలానే ప్రభుత్వ అనుమతి తెచ్చుకుని మొత్తం ముప్పై మూడు వేలు చెల్లించి స్కూల్ శాంక్షన్ చేయించుకున్నారు. నాలుగు గదులతో మొదలయిన ‘వాణిశ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్’ ప్రస్తుతం చాలా పెద్దగా తయారైంది. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల నుండి పిల్లలు ఈ స్కూల్ లో చదువుతున్నారు. ఇక్కడ చదివిన ఎంతోమంది మంది ప్రస్తుతం విదేశాలలో స్థిరపడ్డారంటు దస్థా రామయ్య గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!

తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…

4 hours ago

నమస్కారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఎలా చేయాలో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…

4 hours ago

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

4 hours ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

4 hours ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

5 hours ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

7 hours ago