ఒకప్పుడు టాప్ హీరోయిన్స్.. ఇప్పుడు తల్లి, అత్తా వంటి పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు సంపాదనకూడా భారీగా పెరిగింది. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం యమ డిమాండ్ పెరిగింది. అందుకోసం ఒకప్పటి హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు నేటి దర్శకులు.. వీరి రాకతో నేటి సినిమాల్లో గ్లామర్ ఒక ఎత్తు పెరిగింది అనుకోండి. చిన్న చిన్న హీరోస్ సినిమాల్లోనే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ కి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు నేటి సినిమా మేకర్స్. దీనికోసం భారీగా ఖర్చుపెడుతున్నారు కూడా.. వారికున్న డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారు నాటి తరం హీరోయిన్స్. ఇందుకోసం వీరు పారితోషకం భారీగానే డిమాండ్ చేస్తున్నారు.
వీరిలో ముందుగా చెప్పుకోవాల్సినది శివగామి రమ్యకృష్ణ. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించింది రమ్యకృష్ణ. కథానాయికగా అన్ని భాషల్లో మంచి పాత్రలతో అందరిని ఆకట్టుకున్న రమ్యకృష్ణ. ప్రస్తుతం పవర్ ఫుల్ పాత్రల్లో తనకు పోటీ ఎవరు ఇరు అని నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినది బాహుబలి లో శివగామి పాత్ర గురించి.. ఈ సినిమా తరువాత ఆమె క్రేజ్ ఓ రేంజిలో మారిపోయింది ఒక్క తెలుగులోనే కాదు మొత్తం సౌత్ లో రమ్యకృష్ణ హవా నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది రమ్యకృష్ణ. అందుకోసం భారీ పారితోషకం కూడా అందుకుంటుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం రమ్యకృష్ణ ఒక్కరోజుకు 6 లక్షలకు పైగా పారితోషకం అందుకుంటుందట. ఇక ఫుల్ లెంగ్త్ రోల్ అయితే కోటిన్నర వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం.
రమ్యకృష్ణ అంత కాకపోయినా ప్రస్తుతం బిజీ గా ఉన్న మరో ఆర్టిస్ట్ నదియా. తన అందంతో, నటనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో పవన్ కు అత్త పాత్రలో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన నదియా. ఆ తరువాత ప్రభాస్ కి తల్లిగా “మిర్చి” సినిమాలోనూ తానైన పాత్రలో ఒదిగిపోయారు. అంతేకాదు గ్లామరస్ మదర్ రోల్స్ కు పెట్టింది పేరుగా మారిపోయారు నదియా. ఈ నేపథ్యంలో కొన్ని క్యారెక్టలు ఆమెకోసం వెతుక్కుంటూ వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం నదియా ఒక్కరోజుకు 3 లక్షల పారితోషకం అందుకుంటుందట.
వెళ్లే కాదు అలనాటి హీరోయిన్ జయసుధ కూడా తనదైన శైలిలో తల్లి, అత్త వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమెతోపాటు పవిత్ర లోకేష్ కూడా దర్శకులకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దర్శకులకు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. వీరిద్దరు కూడా భారీగానే పారితోషకం వసూలు చేస్తున్నారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…