Featured

Senior journalist Bharadwaj : చిరంజీవి ఎదుగుదలలో కోదండరామీరెడ్డి పాత్ర లేదా… చిరంజీవి ఆయనని అవమానపరిచాడా… సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior journalist Bharadwaj : చిరంజీవి ‘పునాది రాళ్లు’ సినిమా తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినా ఆయన్ను మాస్ హీరోని చేసింది మాత్రం ‘ఖైదీ 786’ సినిమానే. కృష్ణ చేయాల్సిన ఆ సినిమా చిరంజీవి దగ్గరకి రావడం, ఆ సినిమా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించడం, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగాయి. ఆ సినిమాతో చెప్పాలంటే చిరంజీవి శకం మొదలయినట్లయింది. ఇక మాస్ హీరో ఇమేజ్ తో చిరు వరుసగా హిట్లందుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారు. అలా మైలు రాయి లాంటి సినిమాను అందించిన కోదండ రామి రెడ్డి గారిని చిరంజీవి గారు మరచిపోయి ఆయనను అవమానించారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

చిరంజీవి ఎదుగుదలలో వాళ్లిద్దరూ కీలకం…

చిరంజీవి హీరోగా మొదలయ్యాక ‘న్యాయం కావాలి’ సినిమాతో కోదండరామిరెడ్డి చిరు జర్నీ మొదలయింది. న్యాయం కావాలి లో నెగెటివ్ షేడ్ అయినా ఆ సినిమా సూపర్ హిట్, ఇక ఆ తరువాత ‘అభిలాష’ వంటి హిట్స్ ఉన్నా ఆరో చిత్రంగా వీళ్ళ కలయికలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి కెరీర్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత వచ్చిన ‘గుండా’ అంతగా ఆడకపోయినా ‘ఛాలెంజ్’ సినిమా మళ్ళీ సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు 23 సినిమాలను కోదండరామిరెడ్డి గారు చిరు తో చేసారు. అందులో దాదాపు 15 సినిమాలు సూపర్ హిట్లుగా ఉన్నాయి. అలాంటి అయన గురించి చిరంజీవి మర్చిపోయి ఇతర డైరెక్టర్లను మాత్రమే తన కెరీర్ కు దోహదపడ్డారని చెప్పడం కొంచెం కోదండ రామిరెడ్డి గారిని బాధించింది. దీని గురించి ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా స్పందించారు.

ఈ విషయం గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ చిరంజీవి కెరీర్ పెరుగుదలకు కారణం అయిన ఇద్దరు డైరెక్టర్ల గురించి చెప్పాల్సి వస్తే మొదట కోదండ రామిరెడ్డి, నెంబర్ 2 గా రవి రాజా పినిశెట్టి పేర్లు చెప్పాలంటూ అభిప్రాయపడ్డారు. అప్పట్లో చిరు చేసన సినిమాల్లో దాదాపు వీళ్ళిద్దరూ సూపర్ హిట్లు ఇచ్చి అయనను మెగాస్టార్ చేసారు. అలాంటిది కోదండ రామిరెడ్డి ని విస్మరించి రాఘవేంద్ర రావు వంటి డైరెక్టర్ల పేర్లను చెప్పడం అంత సమంజసంగా లేదు. ఎప్పుడూ వివాదాల జోలికి పోనీ చిరు ఇలా ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆయన గుర్తించినా లేకపోయినా కొదండరామిరెడ్డి సినిమాలు చిరంజీవి కెరీర్ లో కీలకమని అందరికీ తెలుసు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago