Gajuwaka Conductor:సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది వారిలో దాగి ఉన్న టాలెంట్ బయట పెడుతూ పెద్ద ఎత్తున సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారిన వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే గాజువాక బస్సు కండక్టర్ ఝాన్సీ.
గాజువాక డిపోలో బస్ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈమె ఎంతో అద్భుతమైన డాన్సర్. ఈమె కండక్టర్ గాఉద్యోగం చేస్తున్నప్పటికీ డాన్స్ పై ఉన్న మక్కువ పోకపోవడంతో తన భర్త కూడా తనని ప్రోత్సహించడంతో ఈమె డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇలా ఈ వీడియోలు వైరల్ కావడంతో మల్లెమాలవారు తనని శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం చేశారు.
ఇలా ఈ కార్యక్రమంతో అద్భుతమైన పర్ఫామెన్స్ ద్వారా అందరిని ఆకట్టుకున్న ఈమెకు వరుస అవకాశాలు రావడమే కాకుండా పలు ఇంటర్వ్యూలో పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇలా బుల్లితెరపై సెలబ్రిటీ స్థాయి హోదా సంపాదించుకున్న ఈమెకు ఏకంగా వెండితెరపై నటించే అవకాశం కూడా వచ్చింది.
ఈ క్రమంలోనే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తదుపరి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఈమెకు ఫోన్ చేసి అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. ఇలా స్వయంగా సంపూర్ణేష్ బాబు ఫోన్ చేసి అడగడంతో క్షణం ఆలోచించకుండా ఝాన్సీ ఈ పాటలో చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ బయటపెట్టి ఏకంగా సినిమా అవకాశాలను అందుకొని నేడు సెలబ్రిటీగా హోదాని అనుభవిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…