Categories: FeaturedMovie News

Senior Journalist Bharadwaja : కృష్ణ ఆశలను ఆవిరి చేసిన చిరంజీవి… 1983లో జరిగిన ఘటన వెనుక ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ…!

Senior Journalist Bharadwaja : సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. కష్టపడి పైకి వచ్చి ఆయనకంటూ ఒక కొత్త ఇమేజ్ ను సృష్టించుకుని అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే టాప్ హీరోల నెంబర్ గేమ్ లో ఎన్టీఆర్ నెంబర్ వన్ మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లి పోయాక ఆ కుర్చీ ఖాళీగా అయింది. అపుడు ఆ సీట్ లో కృష్ణ గారు కూర్చున్నారా లేక చిరంజీవి గారు కుర్చున్నారా అనే ఆసక్తికర విశ్లేషణను సీనియర్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ గారు అందించారు.

ఎన్టీఆర్, చిరంజీవి మధ్యలో కృష్ణ…

మాస్ హీరోగా ఒక క్రౌడ్ పుల్లర్ గా హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలకు కలెక్షన్స్ తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. ఇక ఆయన తరువాత అంతటి ఇమేజ్ తెచ్చుకున్న హీరో కృష్ణ గారే. ఎన్టీఆర్ గారు జానపద, పౌరణికల్లో ఆయనకు తిరుగులేదు అనేలా ఆయన నటనతో సినిమాలను చేసారు. ఇక ఆయన తరువాత అగ్ర హీరోగా ఉన్న నాగేశ్వరావు గారు సాంఘిక చిత్రాలకు కొట్టినపిండి. వీరిద్దరూ చేయలేని సినిమాలను చేయడాని ఆప్షనల్ గా జానపద పౌరణికాల్లో కాంతారావు గారు, సాంఘిక చిత్రాలలో శోభన్ బాబు, హరినాథ్, రామకృష్ణ ఉండేవారు. అలాంటప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ గారు ఆల్రడీ వీళ్ళు ఉన్న జోనర్స్ లో తను పోటీ పడలేనని ఆయన్ కొత్త జోనర్ క్రియేట్ చేసుకున్నారు. అదే యాక్షన్ అండ్ క్రైమ్. ఈ జోనర్ లో కృష్ణ గారు సక్సెస్ అయ్యారు. మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ఎన్టీఆర్, ఎఎన్ఆర్ తరువాత మూడో స్థానంలోకి వచ్చారు.

అయితే నాగేశ్వరావు గారి చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయి ఇక ఆయన కెరీర్ ముగిసినట్లే అన్న స్థితిలో రామారావు గారు వరుసగా హ్యాట్రిక్ లు ఇస్తున్న సమయంలో ఎన్టీఆర్ కి పోటీగా నిలబడింది కృష్ణ గారు. అటు కలెక్షన్స్ లోనూ ఎన్టీఆర్ తో పోటీపడ్డారు. అలా నెంబర్ 2 కి వచ్చిన ఆయన ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ తో సినిమాల నుండి వెళ్లిపోవడంతో నెంబర్ వన్ ప్లేసులో నిలబడ్డారు. ఆ సమయంలో ‘చట్టానికి కళ్ళు లేవు’ సినిమాతో కృష్ణగారి జోనర్ లోనే హిట్ కొట్టి పోటీగా నిలబడ్డాడు చిరంజీవి. ఇక ‘ఖైదీ’ సినిమాతో కృష్ణ కన్నా టాప్ పొజిషన్ కి వెళ్లిపోయారు. అలా కృష్ణ గారు ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వెళ్ళాక ఒక మూడేళ్లు నెంబర్ వన్ గా ఉన్నా ఆ ప్లేసులో చిరు ఎక్కువకాలం కృష్ణ ని ఉండనివ్వలేదు. అయితే కృష్ణ గారు ఒక జోనర్ కే పరిమితం అయి సినిమాలను తీయలేదు అంటూ కృష్ణ గారి ప్లేసును భరద్వాజ గారు వివరించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago