Senior Journalist Bhardwaja : అన్ స్టోపాబుల్ షోతో ఒక్కసారిగా బాలయ్య బాబు క్రేజ్ భారీగా పెరిగింది. ఓవైపు అఖండ సినిమ హిట్ అవ్వడం మరో వైపు అన్ స్టాపబుల్ సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. అయితే అదే రేంజ్లో నోటి దూల కూడా పెరిగింది బాలయ్యకు. ఇటీవల వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడంతో బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ అక్కినేని ఫాన్స్ కోరుకున్ననారు. అయితే బాలయ్య మాత్రం క్షమాపణలు చెప్పకుండా మా బాబాయ్ ని నేను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతాను అంటూ వివరణ ఇచ్చాడు. ఇక ఇది మర్చిపోక ముందే ఇప్పుడు నర్సుల జోలికి వెళ్ళాడు. అయితే ఈసారి మాత్రం సారీ చెప్పాడు. అప్పుడు నో సారీ ఇప్పుడు మాత్రం ఎందుకు సారీ చెప్పాడు అన్న అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
అది ఇంటి వ్యవహారం… ఇది ఇమేజ్ ను డామేజ్ చేస్తుందని…
బాలకృష్ణ నోటి దురద ఎక్కువ అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో అందుకే బాలయ్య నోరుజారి ఏదైనా అన్నా కూడా తనకి మనసులో ఏమీ ఉండదు, ఏదో నోటి దూలతో అలా అనేస్తాడు అనే భావనలో బాలకృష్ణ ను గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అందుకే అక్కినేని వ్యవహారంలో నాగార్జున కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. కేవలం పిల్లలు అదికూడా చాలా హుందగా స్పందించారు. అయితే నర్సుల వ్యవహారం అలా కాదు అది పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూ.
అందులోనూ బాలకృష్ణ ఒక హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహారిస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వాఖ్యలు చేస్తే వాళ్ళ హాస్పిటల్ లోని నర్సులను ఎలా చూస్తున్నాడు అనే ప్రశ్న వస్తుంది. అదీ కాక నర్సుల సంఘం ఒక పెద్ధ సమూహం. వారి వ్యతిరేకతను ఎదుర్కొంటే అనవసరంగా ఇమేజ్ డామేజ్ అవుతుందని ఆలోచించి నష్టం జరగకముందే సోషల్ మీడియా ద్వారా సారీ చెప్పాడు అంటూ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…