Senior Journalist Bhardwaja : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలను చవిచూశారు. దీనితో నిర్మాతలుగా ఉన్న పూరీ, ఛార్మి ఇద్దరికి డిస్ట్రిబ్యూటర్ల నుండి నిరసన సెగ తగిలింది. డబ్బులు ఇవ్వాలంటూ డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించడం, గొడవల మధ్య ఇప్పుడు మరో దెబ్బ తగిలింది. పూరీ ఛార్మి ఇద్దరినీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇంటరాగేషన్ చేసారు. దాదాపు 13 గంటలు విచారించిన అధికారులు లైగర్ సినిమాకు నిధులను ఎలా సమాకుర్చుకున్నారనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ ఆయన అభిప్రాయాలను తెలిపారు.
విదేశాల నుండి హవాలా నిధులు…
భరద్వాజ గారు మాట్లాడుతూ లైగర్ సినిమాకు పెట్టుబడుల విషయంలో ఈడీ అధికారులు సుమారు 13 గంటల పాటు విచారణ జరిపినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్, ఛార్మి ఇద్దరినీ నిధులు ఎలా వచ్చాయనే కోణంలో ప్రశ్నించారు. విదేశాల నుండి నిధులు వచ్చినట్లు గుర్తించిన అధికారులు ఇందులో పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఇక ఈ విషయంలో ఒకవేళ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే వారు ప్రత్యర్థులు అయితే కేసు ముందుకు వెళ్తుంది, లేదంటే లేదు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వాటిలో ప్రత్యర్థులను ఇరికించడం మామూలే అంటూ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి విచారణ జరుగుతోంది. ఇక ఈ స్కాం లో ఇప్పటికీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకుల పేర్లు వినబడుతున్నాయి, ఇంకా పేర్లు బయటికి వస్తాయి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఇక పూరీ, ఛార్మి ల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఈడీ అధికారులు ఆందులో అధికార పక్షానికి సంబంధిచిన రాజకియనాయకులు ఉంటే కనుక కేసు వెనుకబడుతుంది లేదంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వీటిని ఉపయోగిస్తారు అంతకు మించి ఏమి జరగదు. పూరీ కి ఎలాగూ వైసీపీ తో సత్సంబంధాలు ఉన్నాయి, జగన్ తో కూడా మంచి అనుబంధం ఉంది. ఇక డిస్ట్రిబ్యూటర్లతో గొడవలు పూరీ కి కొత్త కాదు, ‘నేనింతే’ సినిమా సమయంలో కూడా గొడవలు జరిగాయి అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…