Makeup Man Madhava Rao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిల్లీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15 న మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఆయన అంతిమ యాత్రలో ఎంతోమంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇక ఆయన గురించి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తో ఆయనకు మేకప్ మాన్ గా పనిచేసిన మాధవరావు గారు తెలిపారు.
కృష్ణ గారికి మొదటి నుండి మేకప్ మెన్ గా ఉన్న మాధవరావు గారు కృష్ణ గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. ఆయన తనను ఒక పనివాడిగా కాకుండా స్నేహితుడిగాను, సోదరుడిగాను చూసేవారంటూ చెప్పారు. ఏ సహాయం కావాల్సినా అడగకముందే కృష్ణ గారు చేసేవారు అంటూ అయన గురించి చెప్పారు. ఇక ఆయనకు చివరిసారిగా ‘శ్రీ శ్రీ’ సినిమాకు మేకప్ వేశానంటూ చెప్పారు. ఇక కృష్ణ గారు మరణించాక ఆయనను అలా ఆచేతంగా చూసి చాలా ఏడ్చాను.
చివరిసారిగా ఆయనకు మేకప్…
ఆ సమయంలో ఏమి చేయాలో ఎవరికీ ఏమి తెలియక పోతే నేనే కృష్ణ గారి మొహం తుడిచి ముక్కులో దూది పెట్టి చేతులు అంత కట్టేసీ నీట్ గా రెడీ చేసాను. ఒకవైపు బాధను దిగమింగుతూనే ఆయనకు అన్నీ చేసాను. ఇక అంతిమ యాత్ర అప్పుడు వెన్నంటే ఉన్నాను అంటూ మాధవరావు గారు ఎమోషనల్ అయ్యారు. అంతిమ యాత్ర అప్పుడు కూడా ఆయనకు స్నానం చేయించి బట్టలు తోడిగి బొట్టుపెట్టి అన్నీ నేనే చేశాను అంటూ కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…