Senior Journalist Bhardwaja : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారు జామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. అంతేకాకుండా సినిమా ప్రముఖులు కూడా ఆయనను కడసారి చూడటానికి క్యూ కట్టారు. అయితే కృష్ణ గారిని చివరిసారిగా చూడటానికి నాగార్జున రాకపోవడంతో పలు రకాల చర్చలు ప్రస్తుతం నెట్టింట జరుగుతున్నాయి. వీటి పైన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు క్లారిటీ ఇచ్చారు.
నాగార్జునకు, కృష్ణకు మధ్య విబేధాలు…
అక్కినేని నాగేశ్వరావు గారికి కృష్ణ గారికి మధ్య చక్కటి అనుబంధం ఉండేది. అయితే దేవదాసు సినిమా సమయంలో వారిద్దరి మధ్య విబేధాలు వచ్చినా కృష్ణ గారు మళ్ళీ వాటిని మాట్లాడి పరిష్కరించుకున్నారు అంటూ భరద్వాజ గారు చెప్పారు. ఇక నాగార్జునతో కూడా కృష్ణ పలు సినిమాల్లో నటించారు. అయితే వారసుడు సినిమా సమయంలో అభిమానుల మధ్య గొడవలు జరిగినా అవి హీరోల మధ్యకు పోలేదంటూ వివరించారు. కృష్ణ గారి పాత్ర నిడివి తక్కువగా ఉందని ఆయన అభిమానులు గొడవ చేయడం జరిగింది ఆ తరువాత కృష్ణ గారు మీడియా ద్వారా అభిమానులకు సర్ది చెప్పారు.
కానీ ఈ ఇష్యూలో నాగార్జున కి కృష్ణ కి మధ్య విభేదాలేమీ లేవని భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అలా విబేధాలు ఉండి ఉంటే మళ్ళీ ఇద్దరూ కలిసి రాముడొచ్చాడు సినిమాలో నటించారు, అది కూడా ఆ సినిమా నాగార్జున సొంత బ్యానర్ సినిమా అంటూ చెప్పారు. అయితే ఇప్పుడు ఏవో బిజీ పనుల వల్ల రాలేక పోయారు నాగార్జున అంతే కానీ వ్యక్తిగతంగా విబేధాల వల్ల కాదు. అలా అయితే నాగ చైతన్య కృష్ణ గారిని చూడటానికి రాడు కదా అంటూ వివరించారు భరద్వాజ గారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…