Senior Journalist Bhardwaja : అన్ స్టాపబుల్ 2 షోలో బాలకృష్ణ వైస్సార్ ను పొగడటం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఇదే : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఒరిజినల్స్ లో వస్తున్న అన్ స్టాపబుల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ షో సీజన్ వన్ అయిపోయి సీజన్ 2 కూడా మొదయింది. సీజన్ 2 లో మొదటి ఎపిసోడే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ని ఆయన కొడుకు నారా లోకేష్ ని పిలిచి పొలిటికల్ హీట్ పెంచారు బాలయ్య. ఇక ఆ షోలో వైస్సార్ గురించి ప్రస్తావన రావడం నాకు మంచి మిత్రుడు వైస్సార్ అంటూ చంద్రబాబు చెప్పడం ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

వైస్సార్ ను, జగన్ నుండి దూరం చేస్తున్నారు…

అన్ స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే స్పీకర్ సురేష్ రెడ్డి సీనియర్ హీరోయిన్ రాధిక రానున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, బాలకృష్ణ ముగ్గురూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, పైగా స్నేహితులు కావడంతో ఈ షోలో మరింత ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ని పిలవడం రాజకీయ వ్యూహమే అంటూ అభిప్రాయపడ్డారు. వైస్సార్ ను వైస్సార్సీపీ నుండి దూరం చేసే వ్యూహన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు వచ్చినపుడు వైస్సార్ నా మిత్రుడు అనడం అలాగే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినపుడు వైస్సార్ గొప్ప వ్యక్తి అంటూ బాలకృష్ణ పొగడడం ఇవన్నీ కూడా వైస్సార్సీపీ నుండి వైస్సార్ ను వేరుగా చూడడంలో భాగమే అంటూ అభిప్రాయపడ్డారు.

కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హెలీకాప్టర్ ప్రమాదం ముందు సంఘటనలు మాట్లాడటం, వైస్సార్ కు ఒక మంత్రి తప్పుడు సలహాలు ఇచ్చేవాడంటూ చెప్పడం ఇవ్వన్నీ కూడా రాజకీయ వ్యూహాలు అంటూ చెప్పారు. కిరణ్ ప్రస్తుతం కాంగ్రెస్ లో క్రియాశీలకంగా లేకపోయినా కాంగ్రెస్ నుండి దూరం కాలేదు. అప్పట్లో వైస్సార్ కి దగ్గరగా ఉన్న వారిలో కిరణ్ అలాగే సురేష్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు వారిద్దరు జగన్ కి దగ్గరగా లేరు అంటూ చెప్పారు. జగన్ ఎలాగైతే ఎన్టీఆర్ ను టీడీపీ నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడో అలానే టీడీపీ కూడా వైస్సార్ ను వైసీపీ నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago