Senior Journalist Bhardwaja : డిసెంబర్, జనవరి సీజన్ పండగ సీజన్ కావడం వల్ల పెద్ద సినిమాల సందడి మొదలైంది. హాలీవుడ్ నుండి డిసెంబర్ లో అవతార్ 2 రాబోతుండడంతో తెలుగు సినిమాలపై ఈ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉండనుంది. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ మొదటి భాగం హాలీవుడ్ ప్రేక్షకులనే కాదు లోకల్ తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో భాగంగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తోనే అంచనాలను పెంచింది. మరి ఈ సినిమా కలెక్షస్ ప్రభావం తెలుగు పెద్ద హీరోల సినిమాల మీద ఎలా పడనుంది అన్న విషయం మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.
చిరు, బాలయ్య కు పోటీ ఇవ్వనున్న అవతార్ 2…
సంక్రాంతి తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్ చాలా సినిమాలు వేచి మరి పండగ అప్పుడు విడుదల అవుతాయి. ఈ సారి అసలే చిరు, బాలయ్య ఇద్దరూ కలిసి బాక్స్ ఆఫీస్ బరిలో వాల్తేరు వీరయ్య గా, వీరసింహరెడ్డి గా పోటీ పడబోతుంటే వీరికి పోటీగా అవతార్ 2 గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ భరద్వాజ అవతార్ మొదటి భాగం కలెక్షన్స్ పరంగా ఏపీ తెలంగాణ ల్లో కూడా అప్పట్లో సంచలనం రేపింది. ఇక ఇప్పుడు వస్తోన్న రెండో భాగం కూడా అంతకు మించిన అంచనాల్తో రాబోతోంది.
ఇక్కడ కూడా సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. అయితే సినిమాను డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మిగిలిన తెలుగు సినిమాలకు ఒక మూడున్నర వారాల గ్యాప్ అయితే రావడం కొంచెం మంచి విషయంమే కానీ సినిమా జనాలకు నచ్చితే మాత్రం వసూళ్లు ఈ సినిమాకు అధికంగా ఉంటాయి వాటిని తట్టుకుని బాలయ్య చిరు నిలబడతారో లేదో చూడాలి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. సినిమా అద్భుతం అంటేనే థియేటర్ కి వెళ్తున్నారు లేదంటే లేదు. అలాంటపుడు అవతార్ ముందు ఈ సినిమాలు ఏ మేరకు నిలబడతాయో చూడాలి అంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…