Senior Journalist Bhardwaj : ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా ఎన్టీఆర్ కొత్త సినిమా పట్టాలెక్కలేదు. కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా వస్తోంది అంటూ రోజుకో వార్త వస్తున్నా ఇంకా క్లారిటీ లేదు. ఇక రామ్ చరణ్ ఆచార్య అంటూ వచ్చినా రాజమౌళి తో చేసిన హీరో ఆ తరువాత ఫ్లాప్ ఇస్తాడు అంటూ ప్రూవ్ చేసాడు. దీంతో ఎన్టీఆర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. అయితే ఎన్ని నెలలు గడుస్తున్నా ఒక సినిమా కూడా ఇంకా పట్టాలెక్కలేధు. కొరటాలతో పాటు ఉప్పెన డైరెక్టర్ చిట్టిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు బయటికి వినిపించింది. అయితే ఇపుడు ఈ సినిమా రామ్ చరణ్ చేతికి వెళ్ళిపోయింది. ఈ విషయాల మీద సీనియర్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.
కథ విషయంలో కన్విన్స్ కలేకపోయిన తారక్…
ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు ఎన్నో రోజులు కష్టపడి సిద్ధం చేసుకున్న కథ తారక్ తోనే తీయాలనే ఉద్ధేశంతో చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే కథ తారక్ కు నచ్చినా ఆ కథ తన మీద వర్క్ ఔట్ కాదనే ఆలోచనలో ఉన్నాడు. ఇక కథలో వయసు అయిపోయిన పాత్ర కూడా హీరో చేయాల్సి ఉంటుంది. హీరో అన్ని వయసులలోనూ కనిపించే ఒక దృఢమైన కథను తయారు చేసుకున్న చిట్టి బాబు కథ మార్చడానికి ఒప్పుకోకపోవడంతో వల్ల తారక్ ఒకసారి రామ్ చరణ్ కి కథ వినిపించు అని చెప్పి తాను చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు అని చెప్పారట.
ఆల్రెడీ జక్కన సినిమా చేసిన హీరో ఫ్లాప్ అందుకుంటాడు అనే సెంటిమెంట్ వల్ల ఆచితూచి అడుగులేస్తున్న తారక్ ఇలాంటి ఒక భారమైన సబ్జెక్ట్ కాకుండా ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ తో రావాలని అనుకుంటున్నాడు అందుకే ఆ సినిమా వదులుకున్నాడు. ఇక రామ్ చరణ్ అల్రెడి తన ఖాతాలో ఆచార్య రూపంలో ఒక ఫ్లాప్ పడింది. ఇక శంకర్ సినిమా ఇపుడే పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో రామ చరణ్ ఈ లోపు ఒక సినిమా చేయాలని భావిస్తున్నారు. ఇక చిట్టి బాబు కథ నచ్చడంతో ఓకే చెప్పాడు అంటూ విశ్లేషించారు భరద్వాజ గారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…