Hero Suman: సాధారణంగా ఒక సినిమా చేయాలంటే కథ కథనం ఎంతో ముఖ్యమైనవి. మన కథలో సత్తా లేనప్పుడు భారీ బడ్జెట్ సినిమా అయినా భారీ కాస్టింగ్ అయిన సినిమాకు ఎలాంటి ఫలితం ఉండదు. కథలో సత్తా ఉంటేనే చిన్న సినిమాలైనా కూడా ఇండస్ట్రీలో మంచి వసూళ్లను రాబడతాయని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి.
ఇకపోతే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమన్ కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశారు. అయితే సుమన్ నటించిన సమరం అనే సినిమా మాత్రం భారీ బడ్జెట్ భారీ కాస్టింగ్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా కథలో ఎలాంటి కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా తమిళ దర్శకుడు సెల్వమణినీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెళ్లయిన అనంతరం రోజా మొదటిసారిగా శ్రీ సాయి రోజా ప్రొడక్షన్లో సుమన్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఈ సినిమాకు అథిరడి పడై, తెలుగులో ‘సమరం’ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో సుమన్ హీరో కాగా రఘు, రోజా, పునీత్ ఇస్సార్, కైకాల, కోట, బాబు మోహన్, సిల్క్ స్మిత తదితరులు నటీనటులు.. మేస్ట్రో ఇళయరాజా సంగీతం.ఎస్పీ బాలసుబ్రమణ్యం జానకి వంటి సింగర్లు కూడా ఇందులో పాటలు పాడారు. ఇలా భారీ తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల చేయడంతో ఒక్కసారిగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని నిర్మాతగా రోజాకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా దెబ్బతో రోజా నిర్మాణ రంగం వైపు అడుగులు వేయలేదు. భారీ తారాగణం అయినప్పటికీ కథలో కంటెంట్ లేకపోవడంతో సుమన్ లాంటి హీరోకి కూడా డిజాస్టర్ తప్పలేదని ఈ సినిమా నిరూపించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…