Actress Sukanya: 80, 90లలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ప్రస్తుతం కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉండగా మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ విధంగా 80,90 లలోఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సుకన్య గురించి ఈ తరం వారికి తెలియకపోయినా నిన్నటి తరం వారికి ఈమె సుపరిచితమే.
ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఈమె పెద్దరికం సినిమా ద్వారా జగపతిబాబు సరసన తెలుగు పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. తమిళ నిర్మాత రమేష్ కుమార్తెగా భారతీయ రాజా దర్శకత్వంలో వచ్చిన ఫుదు నెల్లు పుదు నాథు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుకన్య ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ప్రస్తుతం సుకన్య విదేశాలలో నివసిస్తున్నారు అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో మరోసారి జగపతిబాబుకి భార్యగా మహేష్ బాబుకి తల్లిగా సుకన్య సందడి చేశారు.దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.
ఇకపోతే పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో అమృతవల్లి పాత్రలో నటించి సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…