Ali Son In Law: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలీ తాజాగా తన పెద్ద కుమార్తె ఫాతిమాకు వివాహం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కన్వెన్షన్ హాల్లో ఈయన కుమార్తె వివాహం ఎంతో ఘనంగా జరిగింది.అలీ కుమార్తె వివాహానికి సినీ సెలెబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి అలీ కుమార్తె అల్లుడిని ఆశీర్వదించి వెళ్లారు.
ఇక ఈయన కుమార్తె వివాహ రిసెప్షన్ కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఆలీ తన అల్లుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు ఆయన ఎవరు ఏంటి అనే విషయాలు గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
అలీ అల్లుడు షహయాజ్ జమీలా బాబీ, జిలానీ భాయ్ దంపతుల రెండవ కొడుకు.అలీ కుమార్తె డాక్టర్ అయినప్పుడు ఈయన ఎంత సంతోషం వ్యక్తం చేశారు. అయితే తనకు పెళ్లి చేసిన కాబోయే అల్లుడు కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో డాక్టర్ అయినటువంటి షహయాజ్ ను తన అల్లుడిగా ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి వీరిది గుంటూరు జిల్లా అయినప్పటికీ తమ కుటుంబ సభ్యులందరూ కూడా లండన్ లో సెటిల్ అయ్యారు.
ఇకపోతే అల్లుడు షయాజ్ మాత్రమే డాక్టర్ కాదు తన అన్నయ్య వదినలు కూడా డాక్టర్లు కావడం విశేషం. ఇలా ఫ్యామిలీ మొత్తం ఉన్నత చదువులు చదివి మంచి వృత్తిలో స్థిరపడ్డారు. అదే విధంగా ఆర్థికంగా కూడా షయాజ్ కుటుంబం ఉన్నతంగా ఉండడంతోనే అలీ ఏరి కోరి తనను తనకు అల్లుడుగా చేసుకున్నారు. షహయాజ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని ఎంతోమంది అలీ బాగా మంచి అల్లుడినే పట్టేశారు కదా అంటూ కామెంట్లో చేస్తున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…