Senior Journalist Bhardwaja : ఎన్టీఆర్ బాడీగార్డ్, పాత సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి వద్ద స్థలం కొన్న చిరంజీవి… ఆ స్థలం కోసం పరిటాల, పవన్ మధ్య గొడవ : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్

Senior Journalist Bhardwaja : పరిటాల రవి, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన గొడవ.. పవన్ కళ్యాణ్ కు ఏకంగా గుండు కొట్టించారు పరిటాల రవి, ఇది జానీ సినిమా సమయం నుండి వినిపిస్తున్న పుకారు. ఎలా పుట్టిందో కానీ ఇప్పటికీ ఇది పవన్ ను విమర్శించేవారికి ఆయుధంగా ఉంటోంది. ఇందులో ఎంత నిజముంది అన్న విషయాలు అప్పటి జర్నలిస్టులు, నాయకులకే తెలియాలి. హైదరాబాద్ లో ఒక స్థలం విషయంలో జరిగిన చర్చలను గొడవగా చిత్రీకరించి అందులో పవన్ కళ్యాణ్ ను కలిపి పరిటాల గుండు కొట్టించాడు అంటూ వార్తలు వ్యాపింపజేశారు. అయితే దాన్ని ఆ తరువాత ఎవరూ ఖండించనూ లేదు, జరగలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక సందర్బంలో పరిటాల రవి భార్య పరిటాల సునీత మాత్రం అలాంటిదేమి జరగలేదని పవన్ కళ్యాణ్ తో పరిచయం లేదని చెప్పారు.

స్థలం గొడవ నిజమేనా…

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పరిటాల కుటుంబానికి దగ్గరవుతున్న సాంకేతలు కనిపిస్తుందడం తో అయన ప్రత్యర్థులు ఈ ఉదంతం గురించి లేవనెత్తి విమర్శిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. నిజానికి శ్రీరాములయ్య సినిమా సమయంలో కారు బాంబు దాడి తరువాత పరిటాల అయన ఇంటికి సెక్యూరిటీ పెంచుకునే ప్రయత్నం చేసారు. అలానే అయన ఇంటి చుట్టూ ఉన్న స్థలాలు కొనడం మొదలు పెట్టారు. అలా జగ్గారావు గారి స్థలం కొనాలనుకున్నారు. జగ్గారావు గారు ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా పనిచేసారు. ఆయన తన స్థలాన్ని అమ్మి ఒక ఫ్లాట్ కొనాలని అనుకున్నారట. అది తెలిసీ చిరంజీవి గారు ఆ స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు. అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక ఇదంతా ఎపుడో జరిగిపోయి ఆ స్థలంలో పవన్ కళ్యాణ్ జానీ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అప్పటికే పవన్ కళ్యాణ్ జానీ సినిమా పనుల్లో ఉంటూ గుండు తో ఉన్నారు.

ఇక అదే సమయంలో పరిటాల గారు ఆ స్థలం కోసం జగ్గారావు ను అడిగితే విషయం చెప్పారు. ఇక ఆ అడ్వాన్స్ కి ఇంట్రెస్ట్ కలిపి స్థలం డబ్బులు ఇస్తామని తొందర పెట్టగా చిరంజీవి వేరే షూటింగ్ లో ఉన్నాను వచ్చాక మాట్లాడుకుందాం అని జగ్గారావు గారికి చెప్పారు. ఇక త్వరగా స్థలం అమ్మాలని పరిటాల వైపు నుండి ప్రెషర్ రావడంతో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా ఒత్తిడి చేస్తున్నారు అంటూ మాట్లాడడానికి వెళితే ఇంకా మాట్లాడుతుండగానే చిరంజీవి కి ఫోన్ వెళ్లి ఇలా పవన్ కళ్యాణ్ ని వాళ్ల వద్ద పెట్టుకున్నారు అంటూ ఫోన్ వెళ్ళింది, దీంతో చిరంజీవి టెన్షన్ పడి టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి జగ్గారావు కు ఫోన్ చేసి ఆ స్థలం తీసుకోను అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇచ్చేయమని చెప్పారు. అయితే అక్కడ ఎలాంటి గొడవ జరగకపోయినా పరిటాల పవన్ ను తీసుకెళ్లాడు, గుండు కొట్టించాడు అంటూ పుకార్లు వచ్చాయి అని భరద్వాజ వివరించారు. పవన్ కళ్యాణ్ చర్చించడానికి వచ్చినపుడు కూడా అక్కడ పరిటాల రవి లేడు. వాళ్ల బావ కృష్ణ రావు గారు మాట్లాడారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago