Senior Journalist Bhardwaja : పరిటాల రవి, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన గొడవ.. పవన్ కళ్యాణ్ కు ఏకంగా గుండు కొట్టించారు పరిటాల రవి, ఇది జానీ సినిమా సమయం నుండి వినిపిస్తున్న పుకారు. ఎలా పుట్టిందో కానీ ఇప్పటికీ ఇది పవన్ ను విమర్శించేవారికి ఆయుధంగా ఉంటోంది. ఇందులో ఎంత నిజముంది అన్న విషయాలు అప్పటి జర్నలిస్టులు, నాయకులకే తెలియాలి. హైదరాబాద్ లో ఒక స్థలం విషయంలో జరిగిన చర్చలను గొడవగా చిత్రీకరించి అందులో పవన్ కళ్యాణ్ ను కలిపి పరిటాల గుండు కొట్టించాడు అంటూ వార్తలు వ్యాపింపజేశారు. అయితే దాన్ని ఆ తరువాత ఎవరూ ఖండించనూ లేదు, జరగలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక సందర్బంలో పరిటాల రవి భార్య పరిటాల సునీత మాత్రం అలాంటిదేమి జరగలేదని పవన్ కళ్యాణ్ తో పరిచయం లేదని చెప్పారు.

స్థలం గొడవ నిజమేనా…
ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పరిటాల కుటుంబానికి దగ్గరవుతున్న సాంకేతలు కనిపిస్తుందడం తో అయన ప్రత్యర్థులు ఈ ఉదంతం గురించి లేవనెత్తి విమర్శిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. నిజానికి శ్రీరాములయ్య సినిమా సమయంలో కారు బాంబు దాడి తరువాత పరిటాల అయన ఇంటికి సెక్యూరిటీ పెంచుకునే ప్రయత్నం చేసారు. అలానే అయన ఇంటి చుట్టూ ఉన్న స్థలాలు కొనడం మొదలు పెట్టారు. అలా జగ్గారావు గారి స్థలం కొనాలనుకున్నారు. జగ్గారావు గారు ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా పనిచేసారు. ఆయన తన స్థలాన్ని అమ్మి ఒక ఫ్లాట్ కొనాలని అనుకున్నారట. అది తెలిసీ చిరంజీవి గారు ఆ స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు. అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక ఇదంతా ఎపుడో జరిగిపోయి ఆ స్థలంలో పవన్ కళ్యాణ్ జానీ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అప్పటికే పవన్ కళ్యాణ్ జానీ సినిమా పనుల్లో ఉంటూ గుండు తో ఉన్నారు.

ఇక అదే సమయంలో పరిటాల గారు ఆ స్థలం కోసం జగ్గారావు ను అడిగితే విషయం చెప్పారు. ఇక ఆ అడ్వాన్స్ కి ఇంట్రెస్ట్ కలిపి స్థలం డబ్బులు ఇస్తామని తొందర పెట్టగా చిరంజీవి వేరే షూటింగ్ లో ఉన్నాను వచ్చాక మాట్లాడుకుందాం అని జగ్గారావు గారికి చెప్పారు. ఇక త్వరగా స్థలం అమ్మాలని పరిటాల వైపు నుండి ప్రెషర్ రావడంతో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా ఒత్తిడి చేస్తున్నారు అంటూ మాట్లాడడానికి వెళితే ఇంకా మాట్లాడుతుండగానే చిరంజీవి కి ఫోన్ వెళ్లి ఇలా పవన్ కళ్యాణ్ ని వాళ్ల వద్ద పెట్టుకున్నారు అంటూ ఫోన్ వెళ్ళింది, దీంతో చిరంజీవి టెన్షన్ పడి టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి జగ్గారావు కు ఫోన్ చేసి ఆ స్థలం తీసుకోను అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇచ్చేయమని చెప్పారు. అయితే అక్కడ ఎలాంటి గొడవ జరగకపోయినా పరిటాల పవన్ ను తీసుకెళ్లాడు, గుండు కొట్టించాడు అంటూ పుకార్లు వచ్చాయి అని భరద్వాజ వివరించారు. పవన్ కళ్యాణ్ చర్చించడానికి వచ్చినపుడు కూడా అక్కడ పరిటాల రవి లేడు. వాళ్ల బావ కృష్ణ రావు గారు మాట్లాడారు.



























