Featured

Senior Journalist Bhardwaja : కృష్ణ అంత్యక్రియలలో నిర్వహణ లోపం..? మహేష్ బాబు అంచనా తప్పిందా.?? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bharadwaja : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారు జామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనను చివరిసారిగా చూడాలని ఆశపడ్డారు. కానీ నిర్వహణ లోపం వల్ల అభిమానులు నిరాశ చెందారు. ఇక ఈ విషయాల పై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను చెప్పారు.

అంత్యక్రియల్లో నిర్వహణ లోపం…

కృష్ణ గారి గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారికి ఉన్నంత మంది ఫ్యాన్స్ కృష్ణ గారికి ఉన్నారంటూ చెప్పారు. ఎన్టీఆర్ గారు పౌరణికం జానపదం లో అశేష అభిమానులను మూటగట్టుకున్నారు. ఇక కృష్ణ గారు పౌరణికాన్ని వదిలి కుటుంబం కథా చిత్రాలను అలాగే జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను తీసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా ఆయనకు అభిమానులుగా మారారు. గుంటూరు ప్రాంతంలోని ముస్లిం యువత కృష్ణ గారికి వీరాభిమానులు. ఇక ఆయనకు దాదాపు 2000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. అంతే కాకుండా ఒక తమ్ముడిని కేవలం అభిమానుల మంచి చెడులను చూడటానికే కృష్ణ గారు పెట్టడం ఆయనకి అభిమానుల మీద ఉన్న ప్రేమ అర్థం అవుతుంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

ఇక ఆయనకున్న అభిమానుల సంఖ్యను కుటుంబ సభ్యులు అంచనా వేయలేక పోయారు. అంత్యక్రియల సమయంలో సామాన్య ప్రజలకు కూడా కృష్ణ గారిని కడసారి చూసే అవకాశం కల్పించుంటే బాగుండేది. ఆయన కడసారి చూపు కోసం కుటుంబాలు కుటుంబాలు రావడం ఎవరూ ఊహించలేదు. కానీ అంతటి లెజెండ్రి హీరో చనిపోయినపుడు అభిమానులకు కూడా కడసారి చూసే అవకాశం ఇవ్వాల్సింది. బారికేడ్లు విరగొట్టి, చాలా మంది అసహనానికి లోనయ్యారు. ఇక పెద్ద కర్మ రోజునాడు ప్రభాస్ సొంతూర్లో అభిమానులకు అందరికీ అవకాశమిస్తూ కార్యక్రమం చేశారు. అలా బుర్రిపాలెంలో కూడా కృష్ణ గారికి పెద్ద కర్మ నిర్వహిస్తే అభిమానులు కొంత శాంతిస్తారు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago