Featured

Senior Journalist Imandhi Ramarao : కృష్ణ గారి ఆస్తులు ఎవరికి సొంతం… నరేష్..? మహేష్ బాబు..? ఘట్టమనేని ఫ్యామిలీలో ఏం జరుగుతోంది?? సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : లెజెండరీ నటులు సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15 న ఉదయం అవయవాలు పనిచేయకపోవడం వల్ల అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ గారి భార్య ఇందిర గారు మరణించి నెలలు గడవక ముందే కృష్ణ గారు మరణించడంతో ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలమూకున్నాయి. కృష్ణ గారి మరణంతో ఒక తరం ఇండస్ట్రీలో వెళ్లిపోయినట్లయింది. ఇక వారి కుటుంబంలో మహేష్ ఒంటరివాడయ్యడు అంటూ అందరూ సానుభూతి చూపిస్తున్నా ఈ సమయంలో కృష్ణ గారి ఆస్తులు ఎవరికి చెందుతాయి, అందులో నరేష్ కి కూడా వాటా ఉంటుందా అనే అనుమానాలు బయలుదేరాయి. అసలు కృష్ణ గారికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనే చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

అస్థి ఎవరికి.. మహేష్ బాబు, నరేష్ లలో ఎవరికి…

తన నటనా ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో సినిమాలను నటించారు. సొంతంగా సినిమాలను నిర్మించారు. కొత్త ట్రెండ్ ను టాలీవుడ్ కి పరిచయం చేసిన ఆంధ్ర జేమ్స్ బాండ్. అయితే మిగిలిన హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు లాగా ఆస్తులను ఎక్కువగా సంపాదించుకోలేదు అంటూ ఇమంది రామారావు గారు అభిప్రాయపడ్డారు. ఆయన రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం పట్టుబట్టేవారు కాదు, అందుకే ఆయన నిర్మాతల హీరో అయ్యారు. ఆయన చాలా సినిమాలకు పూచికత్తుగా ఉండటం వల్ల నష్టాలను చూడటం అప్పులను కూడా పొగేసుకున్నారు.

ఇక విజయనిర్మల గారి హ్యాండోవర్ లో కొంత ఆస్తులను ఉంచారు. విజయనిర్మల గారు విజయ గార్డెన్స్, ఇల్లు తన పేరు మీద పెట్టుకుని వాటిని మనవడు నవీన్, కొడుకు నరేష్ కి ఇచ్చారు. అయితే స్టూడియో మాత్రమే కృష్ణ గారికి ఉన్న అస్థి అంటూ ఇమంది గారు అభిప్రాయ పడ్డారు. ఇక కృష్ణ గారికి పెద్దగా ఆస్తులేమీ లేకపోవడం వల్ల మహేష్ బాబు హీరో అయ్యాక అప్పులను చాలా వరకు తీర్చాడు, మహేష్ సొంతంగా ఆస్తులను కూడబెట్టుకున్నాడు కాబట్టి కృష్ణ గారికి ఉన్న ఆస్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ నరేష్ తో ఎటువంటి బంధుత్వం లేకపోయినా ఇద్దరూ కలిసి పెరగడం వల్ల ఆయనకేమైనా ఆస్థి కృష్ణ గారు వీలునామా లో రాసి ఉంటే అందులో మహేష్ అభ్యంతరం చెప్పకపోవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago