Senior Journalist Imandhi Ramarao : లెజెండరీ నటులు సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న ఉదయం అవయవాలు పనిచేయకపోవడం వల్ల అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ గారి భార్య ఇందిరా గారు మరణించి నెలలు గడవక ముందే కృష్ణ గారు మరణించడంతో ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలమూకున్నాయి. కృష్ణ గారి మరణంతో ఒక తరం ఇండస్ట్రీలో వెళ్లిపోయినట్లయింది. ఇక వారి కుటుంబంలో మహేష్ ఒంటరివాడయ్యడు అంటూ అందరూ సానుభూతి చూపిస్తున్నఈ సమయంలో కృష్ణ గారి ఆస్తులు ఎవరికి చెందుతాయి, అందులో నరేష్ కి కూడా వాటా ఉంటుందా అనే అనుమానాలు బయలుదేరాయి. ఈ విషయాలన్నీ పూర్తిగా వ్యక్తిగతమైనవి అయినా మహేష్ బాబు కి నరేష్ కి మధ్య అభిప్రాయాబేధాలు ఉన్నాయి అంటూ వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఇది చర్చనియాంశం అయింది. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు విశ్లేషించారు.
నరేష్, మహేష్ మధ్య ఇక ఏ సంబంధాలు ఉండవు…
ఇమంది గారు మాట్లాడుతూ కృష్ణ గారు ఉన్నంతకాలం ఆయనకు గౌరవం ఇచ్చి విజయనిర్మలకు గౌరవం ఇచ్చేవాడు మహేష్ బాబు. వారి మధ్య మంచి రిలేషన్ ఉంది కానీ అది కేవలం కృష్ణ గారి వల్లే అంటూ చెప్పారు. ఇక విజయనిర్మల గారు చనిపోయినపుడు ఆస్తిలో మహేష్ బాబు కి కూడా రాసిచ్చారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఆ ఆస్తి కృష్ణ గారికి సంబంధించిన కావడం వల్ల అది మహేష్ బాబు కి రాసిచ్చింది అనే మాట వినిపించింది. ఇక ఇప్పుడు కృష్ణ గారి ఆస్తిలో నరేష్ కి వాటా ఉంటుంది అనే వార్తల నేపథ్యంలో ఇమంది గారు మాట్లాడుతూ ఒకవేళ కృష్ణ గారు ఆయన ఆస్తిలో వాటా ఇచ్చినా మహేష్ పెద్దగా పట్టించుకోడు.
మహేష్ తనకు తాను చాలా ఎదిగాడు, అలానే వ్యాపారంలోనూ బాగా రానిస్తున్నాడు. ఇక కృష్ణ గారు ఇంతవరకు ఉన్న ఇంటి గురించి ఆస్తి గురించి పెద్దగా గొడవలేమి ఉండవు అంటూ ఇక నరేష్ కి మహేష్ కి మధ్య సంబంధాలు కూడా ఉండవు అంటూ చెప్పారు. కృష్ణ గారి నివాళులు అర్పించడానికి నరేష్ పవిత్ర ను వెంటేసుకురావడం అక్కడ కృష్ణ ఫ్యామిలీ ఎవరికీ నచ్చలేదు. ఇక కృష్ణ గారే పోయాక నరేష్ తో మహేష్ ఇంకా సంబంధాలను కొనసాగించరు. మహేష్ కి కుటుంబం విలువలు ఉన్నాయి. అయితే నరేష్ అలా కాదు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ కృష్ణ గారి పేరు చెడగొట్టాడు అందుకే మహేష్ కి నరేష్ మీద మంచి అభిప్రాయం లేదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…