Actress Madhavi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మన తెలుగమ్మాయిలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వీరు పలు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి.ఇండస్ట్రీలో ఎంతోమంది తెలుగు నటీమణులు కొనసాగుతున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పరభాష హీరోయిన్లపై ఆసక్తి చూపడంతో తెలుగువారు అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోతున్నారు.
ఈ తరంలో ఎంతోమంది తెలుగు తారలు చిన్నచిన్న పాత్రలకే పరిమితం అవుతున్నారు. ఇకపోతే అగ్రతారగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మాధవి సైతం పక్కా హైదరాబాద్ అమ్మాయి. ఈ మెట్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన మాధవి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి కనుమరుగైపోయారు. ఈమెతో పాటు ఇండస్ట్రీలో పనిచేస్తున్న హీరోయిన్ లందరూ ప్రస్తుతం సెకండ ఇన్నింగ్స్ ప్రారంభించి యంగ్ హీరో హీరోయిన్లు తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి మాధవి మాత్రం వెండితెరకు దూరంగా ఉంటూ విదేశాలలో నివసిస్తున్నారు. అయితే ఈమె వివాహమైన అనంతరం తన జీవితాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించటం వల్లే తాను సినిమాలలోకి రాలేకపోతున్నారని సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే తాను ఇండియా తిరిగి రావాలి, ప్రస్తుతం తను ఇండియాకి రాలేరని తెలుస్తుంది. కేవలం తన ఫ్యామిలీ కారణంగానే నటి మాధవి ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…