Actress Bhoomika: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యువకుడు సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి భూమిక.ఢిల్లీలో పుట్టి పెరిగినటువంటి ఈమె కెరియర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం పలు భాష చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగులో యువకుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలందరి సరసన నటించడమే కాకుండా, ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఎంతో పద్ధతిగా నటించడంతో ఈమెకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు.ఇలా తన సినీ కెరియర్లో ఎన్నో అవార్డులు ప్రశంసలతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న భూమిక కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమై తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత పలు సినిమాలలో వదిన, అక్క పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ మధ్యకాలంలో భూమిక షేర్ చేసే ఫోటోల వల్ల కాస్త నెగెటివిటీ ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా భూమిక గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు.
ఇలా అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ ఈ వయసులో ఇలా అందాల ఆరబోయడం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇదేం పోయేకాలం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా ఉన్నటువంటి భూమిక ఇప్పుడు ఇలాంటి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు తనపై ఇలాంటి నెగటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…