Featured

Senior Journalist Imandhi Ramarao : కృష్ణ మరణానికి మహేష్ బాబు న్యాయం చేయలేదు : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. అంతటి లెజెండ్రి నటుడు మరణిస్తే ఆయన అంత్యక్రియలు సాధారణ వ్యక్తిలాగే మహాప్రస్థానంలో జరగడంతో అభిమానులు బాగా నిరాశ చెందారు. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

మహేష్, కృష్ణ గారికి న్యాయం చేయాల్సింది…

కృష్ణ గారి మరణం మహేష్ బాబు కి ఖచ్చితంగా తీరని లోటు. ఇటీవలే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణం అపై కొద్ది రోజులకు కన్నతల్లి ఇందిరా దేవి గారు మరణించారు ఇంతలోనే కృష్ణ గారు మరణించడం ఈ ముడు మరణాలు మహేష్ ను ఒంటరిని చేసాయి. అయినా తండ్రి ని దేవుడితో పోల్చిన మహేష్ ఆయన మరణానికి న్యాయం చేయలేదంటూ ఇమంది గారు అభిప్రాయ పడ్డారు. ఆయన కడసారి చూపు కోసం చాలా మంది అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి చాల మంది వచ్చారు.

కానీ కృష్ణ గారిని కడసారి చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు, కేవలం సెలబ్రిటీస్ మాత్రమే ఆయనను కడసారి చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు అగ్రహానక్కి గురయ్యారు. ఇక ఆయన అంత్యక్రియలు పద్మాలయా స్టూడియోలో చేసి స్మారకంగా ఏదైనా చేసుంటే ఆయన అభిమానుల సందర్శనకు వీలుగా ఉండుంటే బాగుండేది. కానీ అలా కాకుండా మహా ప్రస్థానంలో సాధారణ వ్యక్తికి చేసినట్లు అంత్యక్రియలు చేయడం పట్ల ఆయన అభిమానులు నిరాశ చెందారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

4 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

4 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

5 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

5 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

5 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

5 hours ago