Senior journalist Bharadwaja : చక్రపాణి, నాగిరెడ్డి వీళ్ళిద్దరి కాంబినేషన్ అనగానే వారి సినిమాల కన్నా ముందు వారి స్నేహం గుర్తొస్తుంది. చక్రపాణి గారి అసలు పేరు ఆలూరి వెంకటరామయ్య, అయన పుట్టింది తెనాలి, రచయితగా పబ్లిషర్ గా జ్యోతి అనే పత్రికను నడిపిన అయన నేటికీ పిల్లలను అలరిస్తున్న చందమామ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. జ్యోతి పత్రిక నేడు ఆంధ్రజ్యోతి దినపత్రిక గా మారింది. ఇక చక్రపాణి గారి ఆధ్వర్యంలో యువ, కీనిమా అనే పత్రికలు వచ్చేవి. అంతే కాకుండా రాజకీయ సటైర్లు వేస్తూ కూడా పబ్లికేషన్స్ వచ్చేవి. ఇక ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టింది మాత్రం నాగిరెడ్డి స్నేహం తోనే.
గుండమ్మ కథ లో సూర్యకాంతం కు భర్త అందుకే లేడు…
నాగిరెడ్డి గారు అడగడం వల్ల ఇక చక్రపాణి గారు సీనిమా నిర్మాణం లోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ ఎవరైనా ఈయన డైరెక్టర్ ను డైరెస్ట్ చేసేవాడు. వాహిని స్టూడియో లో నాగిరెడ్డి షేర్స్ కొనడం వల్ల విజయ వాహిని గా పేరు మార్చి ఆ స్టూడియో నిర్మాణంలో సినిమాలను చక్రపాణి నాగిరెడ్డి లు తీశారు. ఇక విజయ వాహిని లో చివరి సూపర్ హిట్ సినిమా ‘గుండమ్మ కథ’. మొదటి నుండి చక్రపాణిగారికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. కొడుకుతో సమంగా చూసేవారు. ఇక హీరో హీరోయిన్లంటే ఎన్టీఆర్ సావిత్రి ఆయనకు గుర్తొస్తారు. గుండమ్మ కథ అనుకున్నాక వారినే తీసుకున్నారు. ఇక సూర్యకాంతం గుండమ్మ పాత్రలో నటించాలని అనుకున్నాక ఆవిడ పాత్రకు భర్త ను పెట్టాలా వద్దా అని కమలాకర్ కామేశ్వరరావు గారు అడిగితే చక్రపాణి గారు వద్దు దేశాలు పట్టుకుపోయాడని చూపించమని, భర్త పాత్ర ఎందుకు సూర్యకాంతం పాత్రకు అంటూ అన్నారట. ఇక సినిమా సమయానికి జమున తో ఆయనకు విభేదాలు ఉంటే కేవి రెడ్డి గారి మధ్యవర్తిత్వంతో జమున ను సినిమాకు ఒప్పించారు. ఇక సినిమా కోసం ఏ నటులవి కాల్షీట్ తీసుకోకుండా ఆ స్టూడియోకి వేరే షూటింగులకు వచ్చినపుడు బ్రేక్ లో పిలిపించుకుని షూటింగ్ చేసేవారట. ఇక సినిమాలో ‘ప్రేమ యాత్రలకు’ పాటను ఊటి లో తీయాలని డైరెక్టర్ కమలాకర్ గారు భావిస్తే ఎందుకు విజయ గార్డెన్స్ లో షూట్ చేద్దాం అనగా అప్పుడే అక్కడ ఉన్న రచయిత పింగళి నాగేంద్రగారికి పాటకు పల్లవి వచ్చింది అదే ప్రేమ యాత్రలకు ఊటీ ఎందుకు విజయ గార్డెన్స్ చాలుగా అంటూ చెప్పారట. అలా చక్రపాణి గారు సినిమా విషయంలో బడ్జెట్ పెరగకుండా జాగ్రత్త పడేవారట.
భానుమతి తో గొడవ…
ఇక ‘మిస్సమ్మ’ సినిమా సమయంలో భానుమతి షూటింగ్ కి లేట్ గా రావడంతో అప్పటికే ఆమెపై కొంచెం అసంతృప్తితో ఉన్న ఆయన ఆ సాకుతో ఆమెను సినిమా నుండి తప్పించారు. ఎందుకు లేట్ గా వస్తున్నావని అడిగితే ఆవిడ మా ఇంట్లో వ్రతాలు ఉన్నాయని చెప్పడంతో అయితే ఆ వ్రతాలే చేసుకో సినిమాలెందుకు అని అన్నారట. భానుమతి గారు మిస్సమ్మ సినిమా సమయంలో బొట్టు తీయడానికి, నైటీ వేయడానికి అభ్యంతరం చెప్పడం అక్కడికీ సర్దుకున్నా ఇక లేట్ రావడం వల్ల షూటింగ్ ఆలస్యం అవడంతో ఆమెను తప్పించారు. కానీ భానుమతి గారిని ప్రతి దీపావళికి చక్రపాణి గారి పత్రిక యువలో ఒక సంచిక రాయమని ఇంటికి వెళ్లి మరీ అడిగేవారట. ఇక ఈ విషయాలన్నీ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…