Featured

Vasanthi Krishnan : ఫస్ట్ లవ్, క్రష్, ముద్దు గురించి చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ… బ్రేక్ అప్ స్టోరీ… సుడిగాలి సుధీర్ ఎలాంటివాడంటే : వాసంతి కృష్ణన్

Vasanthi Krishnan : మోడలింగ్ తో మొదలై, కన్నడ సినిమాలను చేసి మళ్ళీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తెలుగమ్మాయి వాసంతి కృష్ణన్. తిరుపతికి చెందిన వాసంతి ప్లస్ టూ తరువాత డిగ్రీ కోసం బెంగళూరు వెళ్లి పైలట్ అవ్వాలని అనుకుంది. ఆ తరువాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులేసి కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడలింగ్ చేస్తూ ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని కన్నడ సినిమాలు చేసిన వాసంతి తెలుగు ఇండస్ట్రీకి మా టీవీ ద్వారా అడుగుపెట్టింది. తెలుగులో సిరిసిరి మువ్వ, గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నా ఫస్ట్ క్రష్.. ఫస్ట్ లవ్.. ఫస్ట్ కిస్…

ఇక నా ఫస్ట్ క్రష్ ఇంటర్ చదివే సమయంలో ఒకరిని చూసినపుడు కలిగింది. ఇక డిగ్రీ లో కూడా ఒకరిద్దరిని చూసి ఇష్టపడ్డాను కానీ ఎవరికీ వెళ్లి ప్రొపోజ్ చేయలేదు. ఎవరైనా నచ్చితే నాలో నేనే ఆనందపడుతాను కానీ వారికి వెళ్లి చెప్పను అంటూ చెప్పింది వాసంతి. బిగ్ బాస్ సీజన్6 లో కంటెస్టెంట్ గా వచ్చిన వాసంతి తన వ్యక్తిగత జీవితం గురించి యూట్యూబ్ లో బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూలో పంచుకుంది. వాంటెడ్ పండు గాడు సినిమాలో నటించిన వాసంతి సుడిగాలి సుధీర్ చాలా చిల్ పర్సన్ అంటూ చెప్పింది.

తన బిహేవియర్ అమ్మాయిలతో కానీ పెద్ద వాళ్ళతో కానీ బాగుంటుంది, చాలా గౌరవిస్తాడు అందుకే అతనికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ చెప్పింది వాసంతి. ఇక తన లైఫ్ లో మొదటి కిస్ తన కుక్క పిల్ల చింటూ కి పెట్టడం అది చాలా స్పెషల్ అంటూ చెప్పింది. ఇక తాను డిగ్రీ చదివే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించినా అతను నా గురించి మాట్లాడటం అవి నచ్చక బ్రేక్ అప్ చెప్పానని చెప్పింది. అయితే ఇంతవరకు ఎవరికీ నేనే మొదట ప్రపోజ్ చేయలేదంటూ వాసంతి తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago