Senior Journalist Bhardwaja : నందమూరి తారకరత్న శివరాత్రి రోజున మృత్యువుతో దాదాపు 23 రోజులు పోరాడి మరణించారు. ఆయన మరణించిన బాధలో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఉండగా నా కుటుంబం అంటూ చెప్పుకుంటూ తిరిగే లక్ష్మి పార్వతి తారకరత్న ఎపుడో మరణిస్తే కావాలనే దాచి పెట్టి ఇన్నిరోజులకు బయటకు చెప్పారంటూ ఇది చంద్రబాబు నాయుడు కుట్ర అంటూ విమర్శలను గుప్పించారు. అయితే ఆ సమయంలో వైసీపీ కి చెందిన విజయసాయి రెడ్డి కూడా తారకరత్నకు వరసకు మావయ్య అవడంతో ఆయన తారకరత్న హాస్పిటల్ లో ఉన్నపుడు వెళ్లి పరామర్శించారు. అలా వెళ్ళినపుడు ఆయన కోలుకుంటున్నాడంటూ చెప్పారు. మరి విజయసాయి రెడ్డి ఎందుకు బాలకృష్ణ చంద్రబాబు మీద విమర్శలు చేయలేదు. నిజంగానే అలా మరణించిన వ్యక్తిని పెట్టుంటే ఆయన ఆరోజే మీడియా ముందే చెప్పేవాడు కదా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మాట్లాడారు.
లక్ష్మి పార్వతికి, విజయసాయి రెడ్డి కి తేడా అదే…
భరద్వాజ గారు మాట్లాడుతూ తారకరత్న గారు కుప్పకూలిన రోజే మరణించారని కాకపోతే లోకేష్ పాదయాత్ర మొదటి రోజే ఇలా జరిగితే అపశకుణంగా భావిస్తారని చంద్రబాబు ఇలా తారకరత్న ను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేయించారు అంటూ చెబుతూ ఇందులో వాస్తవం ఉండి ఉండవచ్చు చంద్రబాబు అలా చేసి ఉండవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు. అయితే లక్ష్మి పార్వతి బాధ్యతా రాహిత్యంగా ఆ విషయాలను మాట్లాడారు.
23 రోజుల పాటు అలేఖ్య రెడ్డిని తన పిల్లలను మానసిక క్షోభకు గురిచేశారు అంటూ విమర్శించారు. ఆమె ఆ 23 రోజులు చూస్తోంది కానీ విజయసాయి రెడ్డి తన కూతురుగా అలేఖ్య జీవితాన్ని చూస్తున్నాడు. అందుకే ఆయన విమర్శలకు రాజకీయాలను పక్కన పెట్టి చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లతో అలేఖ్య రెడ్డి అలానే పిల్లలు భవిష్యత్ గురించి మాట్లాడారు. అదే లక్ష్మి పార్వతికి, ఆయనకు ఉన్న తేడా. అలేఖ్య రెడ్డి జీవితం ఇంకా చాలా ఉంది, తాను ముగ్గురు పిల్లల తల్లిగా వారి బాధ్యతలను చూడాలి. కేవలం డబ్బు మాత్రమే ఇక్కడ పరిష్కారం కాదు కుటుంబం సపోర్ట్ కూడా ముఖ్యం. అదే బాలకృష్ణ, విజయ సాయి రెడ్డి ఆలోచించింది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…