Roja Ramani: నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా రమణి భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాద పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రహల్లాద పాత్రలో నటించిన రోజా రమణికి తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు.
ఇక ఈమె తన కుమారుడు తరుణ్ ను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనంతరం తరుణ్ కూడా ఇండస్ట్రీలో హీరోగా అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఎంత తొందరగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారో అంతే తొందరగా ఫెయిడౌట్ అయ్యారు. అయితే తాజాగా నటి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.
తాను భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహల్లాదుడి పాత్రలో నటించినందుకు గాను ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు వచ్చిందని తెలిపారు. అయితే తరుణ్ సైతం బాలనటుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇలా తరుణ్ మొదటి సినిమాకే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది.
ఒకరోజు టీవీలో న్యూస్ చూస్తున్న సమయంలో నేషనల్ అవార్డు ప్రకటన వచ్చింది. అయితే అంజలి సినిమాకు గాను మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో మాస్టర్ తరుణ్,బేబీ శృతి బేబీ షాలిని అని మూడు పేర్లు స్క్రోల్ అయ్యాయి. అయితే ఇది చూసి మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం కానీ తిరిగి ఈ వార్తలను చూడటానికి కుదరదు కనుక వెంటనే ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం మణిరత్నం గారికి ఫోన్ చేసాము ఆయన అసలు విషయం చెబుతూ హ్యాపీయేనా అంటూ అడిగారని, ఆ క్షణం ఒక్కసారిగా నేను నా భర్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నామని ఈ సందర్భంగా రోజా రమణి తరుణ్ మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్న సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…