Senior Journalist Bhardwaja : సంక్రాంతి పండగ ఈసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిచ్చు పెట్టింది. ఒకవైపు అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ల సినిమాలు విడుదల అవుతుంటే మధ్యలో దిల్ రాజు తన తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ని బరిలోకి దింపుతున్నాడు. తెలుగు సినిమాల సీజన్ టైంలో డబ్బింగ్ సినిమాను పోటీకి పెట్టొద్దంటూ కొంతమంది సినిమా పెద్దలు వాదిస్తున్న సమయంలో సురేష్ బాబు మీడియా ముందు మాట్లాడిన మాటలు మరోసారి ఈ చర్చను తెరపైకి తెచ్చాయి. ఇక ఈ విషయంలో తప్పెవరిది, నష్టం ఎవరికి అనే పలు అంశాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు తెలిపారు.
పాన్ ఇండియా అంటూ వెళ్తున్న వేళ డబ్బింగ్ సినిమాను ఆపడమేంటి…
మన సినిమా పక్క రాష్ట్రంలో బాగా ఆడాలని అనుకుంటున్నపుడు పర భాషా చిత్రంను అడ్డుకోవడం ఏమిటి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. సురేష్ బాబు మాట్లాడిన అంశం కూడా దాదాపు ఇలానే ఉంది. మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తం అవుతున్నపుడు ఇతర భాషా చిత్రాలను కూడా మన లోకల్ మార్కెట్ లోకి ఆహ్వానించాల్సిందే అంటూ చెప్పారు.
ఓటిటి వచ్చాక లోకల్ మార్కెట్ చెరిగిపోయి ప్రపంచం మార్కెట్ తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పారు. మన హీరోలు ఇకపై లోకల్ మార్కెట్ లో సినిమాలను చేయరు, పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను ప్లాన్ చేస్తారు. ఇక్కడ రెండు రకాల హీరోలు తయారవ్వుతారు. పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ అలానే లోకల్ మార్కెట్ ను టార్గెట్ చేసే హీరోలు, ఇలా నెక్స్ట్ ఇండస్ట్రీ ఉండబోతోంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…