Featured

Senior Journalist Bhardwaja : 100 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి కలెక్షన్స్… నిజమా లేక హైప్ కోసం చెబుతున్న లెక్కలా…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా అందరు హీరోల సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఈ సారి పండగకు చిన్న చిన్న సినిమాలు చాలానే ఉన్నా పెద్ద సినిమాలు కూడా పోటీపడ్డాయి. ఓవైపు మెగాస్టార్, మరోవైపు బాలయ్య.. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసాయి. ఇక వీరి మధ్యలో తమిళ హీరో విజయ్ వారసుడు అంటూ వచ్చాడు. అయితే సంక్రాంతి పండుగ ఆందరికీ సంతోషాన్నిచ్చింది. ఓ వైపు ‘వీర సింహా రెడ్డి’ కి థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుంటే మరో వైపు ‘వాల్తేరు వీరయ్య’ కు థియేటర్స్ నిండిపోతున్నాయి. ఇక విజయ్ సినిమా వారసుడు కూడా బాగానే ఆడుతోందన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో అసలు సినిమాలకు నిర్మాతలు ప్రకటిస్తున్న వసూళ్లు నిజమేనా కాదా అన్న విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఇచ్చారు.

కలెక్షన్స్ నిజమా లేక హైప్ కోసం ఇస్తున్నవా…

భరద్వాజ గారు సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ రెండు సినిమాలు రొటీన్ కథలతో వచ్చినా పండగ మూడ్ లో హిట్ కొట్టాయంటూ చెప్పారు. ఇప్పటికీ రెండు సినిమాల థియేటర్ల వద్ద హడావిడి కనిపిస్తోందని అయితే బయట జనం ఉండటం కంటే వెహికల్స్ ఎక్కువ ఉండటం చూస్తుంటే సినిమా థియేటర్స్ ఫుల్ ఉంటున్నాయి అంటూ చెప్పారు. అయితే నిర్మాతలు ప్రకటిస్తున్న కలెక్షన్ విషయంలోనే తేడాలు కనిపిస్తున్నాయంటూ భరద్వాజ గారు తెలిపారు. వాల్తేరు వీరయ్య సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వెళ్తున్నారు. సినిమాకు రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు, ఆ సినిమాకు హైప్ ఉందనడంలో సందేహం లేదు. ఇక వీర్ సింహా రెడ్డి క్రేజ్ కూడా బాగానే ఉంది ఆ సినిమాకు మంచి హైప్ అలానే హౌస్ ఫుల్ థియేటర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ విజయ్ సినిమా వారసుడు కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడే పలు సందేహాలు ఉన్నాయి.

అసలు తెలుగు సినిమాకు మార్కెట్ ఎంత ఉంది, నిజంగా వారం రోజులకే రెండు పెద్ద సినిమాలు 100 కోట్ల మార్కెట్ దాటుంటే నెక్స్ట్ వసూళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి అపుడు ఎంత వసూలు చేస్తాయి అన్నదే ప్రశ్న. ఇలా వసూళ్లు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని ప్రకటించడం ఎలా ఉందంటే ఫ్లాప్ సినిమా నిర్మాత థియేటర్ ముందు ఏడుస్తాడు హిట్ సినిమా నిర్మాత ఇంటికి వెళ్లి ఏడుస్తాడు అన్నట్లుగా ఉంది. అయితే రెండు సినిమాలు బాగా హిట్ అయ్యాయి కానీ వసూళ్ల విషయంలోనే సందేహాలు ఉన్నాయి అంటూ భరద్వాజ గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago