Jayamalini : ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ చేస్తున్నారు, కొత్తగా ఎవరో ఒకరు ముంబై నుండి వచ్చిన మోడల్ చేస్తున్నారు. అయితే ఒకప్పట్లో ఐటమ్ సాంగ్ అంటే మాత్రం జ్యోతిలక్ష్మి, జయమలిని, సిల్క్ స్మిత డిస్కో శాంతి, అనురాధ ఇలా కొంతంది గుర్తొస్తారు. అందులోనూ జ్యోతిలక్ష్మి, జయమాలిని అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ కే క్రేజ్ తెచ్చారు. ముఖ్యంగా జయమలిని ఐటమ్ సాంగ్ ఉంటేనే అన్నట్లుగా సినిమాలను తీసిన రోజులు ఉండేవి. హీరోయిన్లకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకున్న జయమాలిని పెళ్లి తరువాత సినిమాలలో నటించడం మానేశారు. కేవలం కుటుంబానికి సమయం కేటాయిస్తూ హ్యాపీ గా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
సిల్క్ స్మిత చేసిన తప్పు అదే…
జయమలిని అప్పటి సినిమాల్లో పనిచేసిన విధానం గురించి మాట్లాడుతూ బాడి షేమింగ్ కానీ ఇబ్బందులు పెట్టడం లాంటివి ఉండేవి కదంటూ చాలా మంచి వ్యక్తులతో లెజెండ్స్ తో నేను వర్క్ చేసానంటూ చెప్పారు. ఎవరు ఎవరికీ కంపిటిషన్ కదంటూ, నాకన్నా ముందు జ్యోతిలక్ష్మి ట్రెండ్ నడిచింది ఆ తరువాత నేను నా తరువాత సిల్క్ స్మిత, ఆ తరువాత అనురాధ ఇలా మారుతుంది అంతే కానీ మేము ఎపుడూ కంపిటిషన్ అనుకోలేదు అంటూ చెప్పారు. నాకన్నా బాగా చేసావ్ అని సిల్క్ ను పొగిడినా నాకేం బాధగా అనిపించదు, తను నా చెల్లెలు వంటిదే అంటూ చెప్పారు.
అయితే సిల్క్ స్మిత ఇబ్బందులు, మరణం గురించి చెబుతూ తాను ఎక్కువగా మాట్లాడేది కాదంటూ చెప్పారు. పెద్దగా తనతో మాట్లాడింది లేదని, అయితే తాను చేసిన తప్పు అంటే సొంతవారిని నమ్మకుండా మూడో వ్యక్తిని నమ్మింది అంటూ చెప్పారు. ప్రేమ ఇవన్నీ పక్కన పెడితే సొంత తల్లి, అన్నను నమ్మలేదు తాను. ఒకవేళ వాళ్ళు నీ డబ్బులను తింటారు అనుకున్నా నీ సొంతవాళ్లు కాదా, సగం తిన్నా సగం నీకంటూ పెట్టేవారు నీకు పెళ్లి చుసి నీతో ఉండేవారు. కానీ ఎవరినో ప్రేమించి నమ్మితే మోసం చేసాడు అంటూ అదే తాను చేసిన పెద్దతప్పు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…