Featured

Senior Journalist Imandhi Ramarao : మంగళగిరి లో విజయం ఎవరిది…ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెర్సెస్ లోకేష్…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నారా లోకేష్, మొదటి అడుగే తడబడ్డాడు. గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు. నిజానికి లోకేష్ అనుకుని ఉంటే తెలుగు దేశంకి కంచుకోటలైన అనేక స్థానాలు ఉన్నాయ్. అక్కడ పోటి చేసి గెలిచి ఉండవచ్చు కానీ టీడీపీకి కష్టమైన నియోజకవర్గంను ఎంచుకుని ఓడిపోయిన మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలుస్తానంటూ చెబుతున్నాడు. తాజాగా యువ గళం పాదయాత్ర ద్వారా తాను పప్పు కాదు అని నిరూపించుకుంటున్న లోకేష్ ఈసారి ఎన్నికలలో మంగళగిరి నుండి గెలుస్తాడా లేదా అనే విషయం గురించి సీనియర్ పాత్రికేయులు ఇమంది రామారావు తెలిపారు.

ఇద్దరిలో పై చేయి ఎవరిది…. లోకేష్ అసెంబ్లీ లో అడుగుపెట్టేనా…

వచ్చే ఎన్నికలలో ఆళ్ళ రామకృష్ణరెడ్డితో పోటీ పడి లోకేష్ గెలుస్తాడా లేదా అనే చర్చ అపుడే మొదలయింది. ఇక ఈ ఇష్యూ గురించి ఇమంది రామారావు మాట్లాడుతూ ఈసారి లోకేష్ గెలిచె అవకాశాలు చాలా ఉన్నాయంటూ చెప్పారు. క్రితం ఎన్నికల్లో కూడ ఎక్కువ తేడా ఇద్దరి మధ్య లేదని గెలిచిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఆ నియోజకవర్గంలో చేసింది ఏమి లేదని అక్కడి ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటు ఇమంది తెలిపారు.

అందుకే ఈసారి అక్కడ లోకేష్ ను గెలిపించాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. యువగళం మొదట్లో తారకరత్న మృతితో కొంత చప్పగా సాగిన తాజాగా లోకేష్ తన స్పీచులతో ప్రజలతో ఇంట్రాక్షన్ తో మంచి గుర్తింపు అలాగే పాదయాత్ర కు మంచి స్పందన తెచ్చుకుంటున్నాడు అంటూ ఇమంది తెలిపారు. మాట్లాడటం రాదనీ, పప్పు అంటూ లోకేష్ మీద విష ప్రచారం చేసిన వైసీపీకి తన స్పీచులతో సమాధానము చెబుతూ తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago