Featured

Senior Journalist Imandhi Ramarao : హీరోయిన్ రజనీ ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించిన వ్యక్తి ఎవరు… ఆ తరువాత గొడవ ఎలా పోయింది..: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : రెండు రెళ్ల ఆరు, సీతా రామ కళ్యాణం సినిమాలతో తెలుగు లో గుర్తింపు తెచ్చుకున్న నటి రజనీ అసలు పేరు శశికౌర్ మాల్హోత్ర. కర్ణాటకకు చెందిన రజనీ ఎక్కువగా తెలుగులో సినిమాలను చేసారు. రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో ఎక్కువగా సినిమాలను చేసిన రజనీ హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో తనను తుపాకీతో కాల్చేస్తానని బెదిరించారనే రూమర్స్ ఉన్నాయి. ఇక ఈ విషయం ఎంతవరకు నిజం అనే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు క్లారీటీ ఇచ్చారు.

తుపాకీ తో బెదిరించారు…

హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజనీ నందమూరి బాలకృష్ణ సరసన సీతా రామ కళ్యాణం లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక నందమూరి కాంపౌండ్ లోనే సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి హీరోగా చేసిన ‘మేనమామ’ సినిమాలో నటించింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే చిన్న గొడవ జరిగి తుపాకీ తో ఆమెను బెదిరించే వరకు వెళ్ళింది. త్రివిక్రమ రావు గారు చాలా కోపిష్టి అయితే అరుదుగానే కోపం వస్తుంది కానీ వచ్చిందంటే తట్టుకోవడం కష్టం అంటూ ఇమంది గారు తెలిపారు.

ఆయన వద్ద ఎపుడూ లైసెన్స్డ్ తుపాకీ ఉంటుందని ఇమంది గారు తెలిపారు. కళ్యణ్ చక్రవర్తి హీరోగా రజనీ హీరోయిన్ గా చేస్తున్న సినిమాల్లో పేమెంట్ విషయంలో గొడవ రావడంతో రజనీ షూటింగ్ నుండి మధ్యలో వెళ్లిపోతుంటే త్రివిక్రమ రావు గారు గమనించి డబ్బుకు నేను హామీ, నిర్మాతతో నేను ఇప్పిస్తానని చెప్పి పంపినా వినకుండా వెళ్లిపోయారట రజినీ. దీంతో కోపం వచ్చిన త్రివిక్రమ రావు గారు ఆమె వెనకనే కారును వెంబడిస్తూ వెళ్లి తుపాకీ గురి పెట్టి బెదిరించారట. నేను హామీ ఇచ్చాక నమ్మకం లేదా అంటూ అడిగేసరికి రజనీ క్షమాపణలు చెప్పి తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారంటూ ఇమంది గారు క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago