Big boss Contestants Rohith & Marina : బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ముగిసింది. అందరూ భావించినట్లే విన్నర్ గా సింగర్ రేవంత్ నిలవగా శ్రీహాన్ సెకండ్ ప్లేసులో నిలిచాడు. అయితే శ్రీహాన్ కు రేవంత్ కి ఓటింగ్ లో పెద్దగా వత్యాసం రాలేదంటూ వినిపిస్తోంది. ఇక ఆదిరెడ్డి, కీర్తి భట్ టాప్ 3 మరియు 4 లో నిలవగా ఈసారి బిగ్ బాస్ లో మాత్రం అనూహ్య పరిణామాలు జరిగాయని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి పెయిర్ గా ఎంటర్ అయిన రోహిత్ మరీనా జంటలో మరీనా మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకి వచ్చినా రోహిత్ మాత్రం చివరిదాకా హౌస్ లో కొనసాగి టాప్ 5 లో మిగిలాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ గురించి అక్కడ జరిగిన పరిణామాలను గురించి మాట్లాడారు రోహిత్ ఆయన భార్య మరీనా.
శ్రీహాన్ 40 లక్షలు తీసుకున్నాక…
బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫైనల్ లో అనూహ్య పరిణామాలు జరిగాయి. శ్రీహాన్ మిడిల్ డ్రాప్ అవడం తో రేవంత్ గెలిచాడు. నిజానికి శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు పడి విన్నర్ అవగా తాను 40 లక్షలకు టెంప్ట్ అయి మిడిల్ డ్రాప్ అయ్యాడు. ఇక రేవంత్ విన్నర్ అయ్యాడు. ఈ విషయాల గురించి మాట్లాడుతూ రోహిత్ శ్రీహాన్ ప్లేసులో ఉంటే తాను ఎందుకు అలా ఆలోచించాడో తెలుస్తోంది. బయట నుండి చూసే మనం ఇలా చేసి ఉండాల్సింది అలా చేసి ఉండాల్సింది అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ చెప్పాడు.
ఇక శ్రీహాన్ 40 లక్షలు తీసుకున్నాక రేవంత్ ను విన్నర్ గా ప్రకటించాక నాగార్జున గారు చెప్పారు శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందరం షాక్ అయ్యాము అంటూ చెప్పారు ఈ జంట. ఇక బిగ్ బాస్ లో తనకు నచ్చిన ఇంటి సభ్యుడు బాలాదిత్య అంటూ రోహిత్ చెప్పగా మరీనా కూడా తనకు ఆదిత్య అన్న అంటే ఇష్టమంటూ చెప్పారు. బాలాదిత్య చాలా నిజాయితీ గల వ్యక్తి అంటూ చెప్పారు రోహిత్. ఇక మొదట్లో గీతూని చూస్తే చాలా ఇర్రిటేటింగ్ అనిపించేది అంటూ రోహిత్ చెప్పగా మరీనా మాత్రం నాకు ఎవరూ అలా అనిపించలేదు, పరిస్థితులను బట్టి వాళ్ళు బిహేవ్ చేశారే కానీ వ్యక్తిగతంగా అలా కాదు అని నా అభిప్రాయం అంటూ చెప్పారు. ఇక బిగ్ బాస్ తమ కెరీర్ కు బాగా ఉపయోగ పడుతుందంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…