Movie News

Seniour Naresh: ఆత్మ రక్షణ కోసం లైసెన్స్ గన్ను కావాలంటూ ఎస్పీని కలిసిన నరేష్!

Seniour Naresh: సినీ నటుడు సీనియర్ నరేష్ తాజాగా పుట్టపర్తి ఎస్.పి మాధవరెడ్డిని కలిసి తనకు ఆత్మరక్షణ కోసం లైసెన్స్ గన్ను కావాలని అభ్యర్థనలు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన హీరోగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తన జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది కానీ డిజిటల్ మీడియాలో మాత్రం ఎంతో మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమా తరువాత నరేష్ పలు సినిమాలలో నటిస్తూ మంచి హిట్ అందుకున్నారు. అయితే తాజాగా ఈయన ఎస్పీని కలిసి లైసెన్స్ గన్ను కోసం అప్లై చేశారని తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా తన ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే అదే సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నరేష్ తాజాగా తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆత్మరక్షణ కోసం తనకు గన్ను కావాలి అంటూ ఎస్పీని కలిశారు.

Seniour Naresh: ప్రాణహాని ఉందన్న నరేష్…


ఇకపోతే గత కొంతకాలంగా నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి మధ్య పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ దాడి కూడా తానే చేయించి ఉంటారంటూ నరేష్ ఆరోపణలు చేశారు.ఇలా తన భార్య వల్ల తనకు ప్రాణహానే ఉందన్న ఉద్దేశంతోనే ఈయన ఆత్మ రక్షణ కోసం లైసెన్స్ గన్ను కావాలంటూ ఎస్పిని అభ్యర్థించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago