Categories: FeaturedMovie News

Senior Producer Chittibabu : మనోజ్, విష్ణు మధ్య గొడవలకి కారణం ఆస్తులేనా… మనోజ్ కి ఫోన్ చేస్తే ఏం చెప్పాడంటే…: సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు

Senior Producer Chittibabu : మంచు మెహన్ బాబు కొడుకుల మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా ఇంట రచ్చ చేస్తూ మోహన్ బాబు గారి క్రమశిక్షణ, సంస్కారం ఎక్కడికి పోయాయని జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా మంచు మనోజ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్ లోడ్ చేసి మళ్ళీ తండ్రి వారించడంతో డిలీట్ చేసాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవకి కారణం ఏమిటి అన్న విషయాల మీద సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడారు.

మనోజ్ మాట్లాడాను… తాను చెప్పింది ఇదే…

చిట్టిబాబు గారు మాట్లాడుతూ కుటుంబ విషయాన్ని అనాలోచితంగా మనోజ్ రోడ్డుకీడ్చాడు అంటూ అభిప్రాయపడ్డారు. ఆస్తులకు సంబందించిన గొడవ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో నిజం లేదు. మోహన్ బాబు గారు తనని ముగ్గురు పిల్లలకు భార్యకు ఆస్తి సరిగా పంచి ఇచ్చేసారు, అందులో ఎలాంటి తగాదాలు లేవు అంటూ చెప్పారు. అక్కడ విష్ణు గొడవ పడింది మనోజ్ తో కాదు మోహన్ బాబు వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కిరీటి అనే వ్యక్తితో, అవన్నీ చిన్నచిన్నవి.

ఆకాశం వైపు చూసి ఉమ్ము వేస్తే మనమీదకి వచ్చిపడుతుంది అన్న చందంగా మనోజ్ అనాలోచితంగా ఆ వీడియోని తీసి నెట్టింట్లో పెట్టాడు. ఎందుకు ఇలా చేసావ్ అని ఫోన్ చేసి నేను అడిగితే ఊరికే సరదాగా పెట్టాను ఇలా అవుతుందని ఊహించలేదు అంటూ చెప్పాడు. వాళ్ళింట్లో ఎలాంటి గొడవలు లేవు, అనవసరంగా మీడియా పెద్దదిగా చూస్తోందంటూ చిట్టిబాబు క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago