Actress Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎందరికో జీవితాన్ని అందించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సౌమ్య రావు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండగా ఇంద్రజ కమెడియన్ కృష్ణ భగవాన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే వచ్చేవారం శ్రీరామనవమి పురస్కరించుకొని ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇంద్రజ సౌమ్యరావు పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో ఏం జరిగిందనే విషయానికి వస్తే…రాఘవ, తాగుబోతు రమేశ్-వెంకీ టీమ్స్ వేర్వేరుగా పానకం తయారు చేశారు.
ఇలా తయారుచేసిన పానకాన్ని టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్పాలని సౌమ్య రావు అడిగారు దీంతో ఇంద్రజ టెస్ట్ చేసి తనకు రాఘవ తయారు చేసిన పానకం నచ్చిందని తెలిపారు.మరోసారి రమేష్ వెంకీ టీం తయారు చేసినది కూడా చూసి చెప్పాలని సౌమ్యరావు అడగగా తనకు రాఘవ తయారు చేసినదే బాగుందని తెలిపారు. అయితే సౌమ్యరావు అంతటితో ఆగకుండా అక్కడున్న వారందరికీ టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్పమని అడిగారు.
ఇలా అడిగేసరికి ఇంద్రజ ఇలా అందరి ఒపీనియన్ తీసుకున్నట్లయితే నన్ను ఎందుకు అడిగావు.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఇంద్రజ సౌమ్యరావు పై సీరియస్ అయ్యారు. ఇక రాఘవ సైతం స్టేజ్ నుంచి బయటకు వెళ్లినట్లు చూపించారు. అయితే ఇదంతా నిజంగానే జరిగిందా లేకపోతే ఎపిసోడ్ పై హైప్ పెంచడం కోసం ఇలా ప్రోమో కట్ చేశారా అనే విషయం మాత్రం తెలియడం లేదు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…