Categories: FeaturedMovie News

Trinayani Serial fame Bhavana Reddy : నన్ను చీపిరి ఆంటీ, దురద పిన్ని అంటూ పిలుస్తున్నారు…: త్రినయని సీరియల్ ఫేమ్ భావన రెడ్డి

Trinayani Serial Fame Bhavana Reddy : సినిమాల్లో నటిస్తూ సీరియల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటి భావన రెడ్డి. మొదట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కమెడియన గాను ఎక్కువగా కనిపించిన భావన రెడ్డి ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. సీరియల్స్ లో ఎక్కువగా బిజీ ఉండటం వాళ్ళ సినిమాలను వదులుకుంటున్నట్లు చెబుతున్న భావన సీరియల్స్ నుండే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు.

దురద పిన్ని అంటున్నారు…

నిజానికి సినిమాల కంటే ఒక ఆర్టిస్ట్ ను సీరియల్స్ బాగా ప్రేక్షకులకు దగ్గర చేస్తాయి. అందులోనూ మన తెలుగు మహిళలు సీరియల్స్ చూసినంతగా సినిమాలను పట్టించుకోరు. అందుకే సీరియల్స్ లో హిట్ అయితే వాళ్లకుండే సెలబ్రిటీ హోదా అంతా ఇంతా కాదు. భావన రెడ్డి కూడా తాను సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినా రాని గుర్తింపు సీరియల్స్ తో తనకు దక్కిందని అందుకే ఎక్కువగా సీరియల్స్ చేస్తున్నట్లు చెప్పారు. పిల్ల జామిందార్, సీమ టపాకాయ వంటి సినిమాల్లో కనిపించిన భావన రెడ్డి జీ తెలుగులో గతంలో వచ్చిన ‘ముద్దమందారం’ సీరియల్ లో చీపురు ఆంటీ గా బాగా ఫేమస్ అయింది.

ఆ సీరియల్ తరువాత మళ్ళీ జీ తెలుగులోనే ‘త్రినయని’ లో దురందర గా నటిస్తున్న ఆమె దురద పిన్నిగా బాగా ఫేమస్. బయట ప్రేక్షకులు కూడా దురద పిన్ని అంటూ మాట్లాడిస్తున్నారంటూ చెప్పారు. ఇక మా టీవిలో ప్రసారమయ్యే ‘పాపే మా జీవన జ్యోతి’ లో నటిస్తున్నారు భావన రెడ్డి. మా టీవిలోని సీరియల్ ఇటు జీ తెలుగు లోని సీరియల్ రెండూ కూడా మంచి రేటింగ్స్ తో ఉన్నాయని చాలా హ్యాపీగా ఉందంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago