హీరోయిన్ రజిని… ఇప్పుడు తరం వారికి అంతగా ఈవిడ తెలియకపోయినా ముందు తరం వారికి ఈవిడ గురించి చాలా బాగా తెలుసు. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్ నాలుగు భాషల్లో ఏకంగా 200 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈవిడ ప్రస్తుతం బెంగుళూరులో ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రజిని జూలై 27, 1965 సంవత్సరంలో బెంగళూరు నగరంలో జన్మించింది. ఇక ఈవిడ తండ్రి పేరు వి ఎల్ మల్హోత్రా, తల్లి పేరు సులోచన. వీరు తండ్రి గారు గుజరాతి, తల్లి గారు కర్ణాటక రాష్ట్రం చెందినవారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇకపోతే ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ గా కొనసాగింది నటి రజిని. ఈమె తన ఇంటి దగ్గరలో ఒక షూటింగ్ జరుగుతుండగా అది చూడటానికి అక్కడ నిలబడి ఉండగా అక్కడ ఆవిడని ఒకతను చూశారు. ఆయన ఎవరో కాదు… అక్కడ షూటింగ్ జరుగుతున్న సినిమాకి డైరెక్టర్. ఆ డైరెక్టర్ కు ఎందుకు అనిపించిందో ఏమో కానీ రజిని సినిమాల్లో నటింపచేయాలని, ఆమె తల్లిదండ్రులను వెళ్లి తన తదుపరి చిత్రంలో నటించడానికి ఒప్పించారు. ఇక తర్వాత తమిళ్ చిత్రంలో ఇళమై కాలంగల్ సినిమాలో నటించి తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అలాగే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మముడి అనే సినిమాలో ద్వారా 1985 సంవత్సరంలో తన మొదటి సినిమా చేసింది. ఇక ఈ సినిమాతో చాలా పాపులరైన ఆమె తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. ఇక అక్కడితో మొదలైన రజిని ప్రస్థానం 1990 వరకు సాఫీగా సాగింది. ఇక తెలుగులో ఆ సమయంలో ఉన్న టాప్ హీరోల సరసన ఆవిడ నటించింది. ఈవిడ వారి తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయన ఒక ప్రముఖ ఎన్నారై డాక్టర్ అతని పేరు ప్రవీణ్. అయితే కొన్ని రోజుల వరకు ఆమె సంసారం సాఫీగానే సాగిన కానీ కొన్ని మనస్పర్థల వల్ల ముగ్గురు పిల్లల తల్లి అయిన తర్వాత ఆవిడ తన భర్త నుంచి విడిపోయింది.
ఇక ప్రస్తుతం రజిని పిల్లల విషయం చూస్తే… ఆమె పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు కేవలం చదువులోనే కాకుండా జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. అయితే ఇక తన కూతురు ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆసక్తి ఉంది. ఆ అమ్మాయికి పెద్దయిన తర్వాత మంచి ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలని ఆశ. ఇలా ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో ఆవిడా ప్రశాంతంగా బెంగళూరులో జీవనం కొనసాగిస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…