Political News

చందు నాయక్ హత్యకేసులో సంచలనం.. అక్రమ సంబంధం, భూ వివాదాలే కారణం..!

తెలంగాణలోని మలక్‌పేటలో సీపీఐ నేత చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇటీవల శాలివాహననగర్ పార్కులో వాకింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగివెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కళ్లలో కారం చల్లి, అతి దగ్గర నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర సంచలనం రేగింది.

Sensation in Chandu Nayak’s murder case

తాజాగా పోలీసులు ఈ కేసులో మొత్తం 9 మందిని గుర్తించి, అందులో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు నేరుగా కాల్పులు జరిపినట్టు దర్యాప్తులో వెల్లడించగా, మిగతా ఐదుగురు వారికి సహాయపడ్డట్టు తెలిసింది. చందు శరీరంలో ఐదు బుల్లెట్లు బయటపడ్డాయి, మరో మూడు బుల్లెట్లు సంఘటనా స్థలంలో స్వాధీనం చేశారు. మిగిలిన మూడు నిందితుల కోసం పోలీసులు పది ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

ప్రాధమిక దర్యాప్తులో వివాహేతర సంబంధం కోణంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో భూ వివాదాలే ప్రధాన కారణంగా కూడా భావిస్తున్నారు. గతంలో చందు నాయక్ వివిధ భూ వివాదాల్లో పాలుపంచుకున్నట్టు సమాచారం. అదే అంశం ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసుల అంచనా.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగు చూడనుండగా, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఈ హత్యcase తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago