Ahmedabad Serial Blast: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు... 38 మందికి మరణశిక్ష ఖరారు
Ahmedabad Serial Blast : 2008 సీరియల్ పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. దీనికి సంబంధించి ఈరోజు శిక్షలు ఖరారు చేసింది కోర్ట్.
2008 జులై 28న నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) వరస పేలుళ్లకు పాల్పడింది. సాధారణ ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. మొత్తం 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా.. 200మంది తీవ్రంగా గాయపడ్డారు. జనావాసాలు, స్కైవేలు, బస్ స్టాండ్ వంటి ప్రాంతాల్లో బాంబులను అమర్చారు. 70 నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి. మరికొన్ని చోట్ల పేలుడు పదార్థాలను భద్రతా అధికారులు నిర్వీర్యం చేశారు.
అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయభదస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు.
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అనే నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న 78 మందిపై 2009 డిసెంబర్‌లో విచారణ ప్రారంభమైంది. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77 కు తగ్గింది. దీంతో అప్రూవర్ గా మారిన వ్యక్తి నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్… నిందితులకు వ్యతిరేఖంగా పక్కాగా సాక్ష్యాలను నమోదుచేసింది. విచారణ సందర్భంగా మొత్తం 1163 మంది సాక్షులను విచారించారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంది. ఈ సంఘటనలో మైనార్టీ సమాజానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస పేలుళ్ల తరువాత సూరత్‌లో అనేక ప్రాంతాల నుంచి పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…