Serial Actress Asmitha : ఈటీవీ లో ఒకప్పట్లో వచ్చిన ‘పద్మావ్యూహం’ లాంటి సీరియల్ నుండి ‘మురారి’ వంటి సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన నటి అస్మిత. అంతవరకు హీరోయిన్ రోల్స్ తో అదరగొట్టిన అస్మిత ఒక్కసారిగా ‘అగ్నిసాక్షి’ సీరియల్ లో భైరవి లాంటి విలన్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరైన అస్మిత ప్రస్తుతం యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి కేవలం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన ఫాలోయర్స్ కి బ్యూటీ టిప్స్, ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక అస్మిత బ్యాక్ గ్రౌండ్ మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. రీసెంట్ ఇంటర్వ్యూలో అస్మిత తన కుటుంబం గురించి వివరించారు.
కోట్ల ఆస్తులున్న అస్మిత…
అస్మిత రాజస్థాన్ కి చెందిన అమ్మాయి. రాజస్థాన్ లో పెద్ద హవేలి కూడా ఉండేదట. అయితే కరువు రావడం వల్ల అక్కడి నుండి అస్మిత పూర్వికులు కలకత్తా వచ్చి అక్కడ వ్యాపారం చేసారు. అలా పూణే, కలకత్తా, హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి అస్మిత కుటుంబానికి. రియల్ ఎస్టేట్ అలానే, ఫార్మా కంపెనీలకు మెటీరియల్ సప్లై చేసే వ్యాపారం చేస్తున్నారు అస్మిత కుటుంబం. పెద్ద కుటుంబం అవ్వడం, ఎన్నో ఆస్తులు ఉన్న అస్మిత ప్రేమించిన వ్యక్తిని వాళ్ళ కుటుంబం అంగీకరించి వారి పెళ్లి చేసింది.
ఇక కొరియోగ్రాఫర్ అయిన సుధీర్ తో అస్మిత దాదాపు 12 ఏళ్ళ నుండి ప్రేమలో ఉన్నారన్న విషయం తెలిసిందే. సుధీర్ గారికి పేరెంట్స్ లేరు కానీ అస్మిత కుటుంబం ఆయనను అంగీకరించారు. ఇక అస్మిత గారికి తన కుక్క అంటే చాలా ఇష్టం అంటూ చెబుతూ కుక్కను చిన్నపటి నుండి పెంచింది తానైతే ఇప్పుడు మాత్రం తన భర్త తోనే ఎక్కువ ఉంటోంది అంటూ అసలు నన్ను ఆస్తి కోసమో, నన్ను ప్రేమించో కాదు నా కుక్క కోసం పెళ్లి చేసుకున్నాడు సుధీర్ అంటూ అస్మిత సరదాగా చెప్పారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…