కేబీఆర్ పార్కుబయట వాకింగ్‌కు వచ్చిన సినిమా నటి షాలూ చౌరాసియాపై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడి.. ఆమె నోటికి గుడ్డలు అడ్డుపెట్టి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, గోల్డ్ రింగ్ లాక్కుని పరారయిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాతో చౌరాసియా మాట్లాడారు.
కొండా పూర్‌లోని బొటానికల్ గార్డెన్స్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న తాను గత మూడు సంవత్సరాలుగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వెళ్తున్నానని.. ఆదివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో కేబీఆర్ పార్కు బయట ఉన్న జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో వాకింగ్ చేస్తున్నానని.. రాత్రి 8.40 ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న తనను కొంతదూరం గుర్తు తెలియని యువకుడు అనుసరించాడని తెలిపింది.
నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే తనను వెనుక నుంచి అతడు గట్టిగా పట్టుకున్నాడని.. రెండు చేతులు వెనక్కి నెట్టి.. నోటికి గుడ్డలు అడ్డుపెట్టి.. బండారాయికి అదిమాడని తెలిపింది. భయపడిపోయిన తాను డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయిని వదిలాడని.. ఫోన్ పే చేస్తానని ఫోన్ తీసుకొని రెండు సార్లు 100 కు ఫోన్ చేశానని చెప్పింది.
అది గమనించిన దుండగుడు తన ఫోన్ ను లాక్కున్నాడని తెలిపింది. హెల్ప్ అని అరుస్తుండగా.. ముఖంపై దాడి చేసి.. బండరాయిపై తోశాడని తెలిపింది. ఈ క్రమంలో తాను మోచేతితో అతడి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్ వద్దకు చేరుకొని.. ఫెన్సింగ్ పైనుంచి దూకి హెల్ప్ అని అరవగానే కాఫీ షాప్ లో ఉన్న కొంతమంది అక్కడకు చేరుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేబీఆర్ పార్క్ లో లైటింగ్ అమర్చాలని నటి కోరింది. ఇక దుండగుల దాడిలో డైమండ్ రింగ్, సెల్ ఫోన్ పోయినట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…