Shankar: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో రామ్ చరణ్ కియార అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మామూలుగా శంకర్ సినిమాలోని పాటలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలిసిందే. ఈయన పాటలపై ఎంతో ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా భారీగా ఖర్చు చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటారు. ఇక ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయని ఈ ఐదు పాటల కోసం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దింపారని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాలోని ఈ ఐదు పాటలను తెరకెక్కించడం కోసం శంకర్ భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇలా ఈ పాటల చిత్రీకరణ కోసం ఈయన ఏకంగా 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ విషయం తెలియడంతో శంకర్ సినిమాలో పాటలు అంటే మరి ఈ రేంజ్ లోనే ఉండాలిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.శంకర్ అద్భుతమైన గ్రాఫిక్స్ కు రాంచరణ్ వంటి అద్భుతమైన డాన్సర్ తోడైతే ఆ సినిమాలోని పాటలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…