బిగ్ బాస్ కార్యక్రమం 5 వారాలు పూర్తి చేసుకుని హౌస్ నుంచి ఐదు మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక గత వారంలో భాగంగా నామినేషన్ లో ఉన్న వారిలో హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే శనివారం ఆదివారం నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ వారు చేసిన తప్పులను ప్రశ్నించడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం హౌస్ సభ్యులతో మాట్లాడిన నాగార్జున హౌస్మేట్స్ వ్యవహరించిన తీరును ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా శనివారం హౌస్ సభ్యులతో నాగార్జున హౌస్ లో రూలర్ ఎవరు, బానిస ఎవరు అనే విషయాన్ని కిరీటం పెడుతూ చెప్పాలని తెలియజేశారు. ఈ క్రమంలోనే చాలామంది శ్రీరామ్ ను రూలర్ అంటూ కిరీట పెట్టగా, హమీదకు బానిస అంటూ కిరీటం పెట్టారు. ఇకపోతే షణ్ముఖ్ వారికి కిరీటం పెట్టకుండా తనకు తానే కిరీటం పెట్టుకొని నాకు నేనే రాజు నేనే మంత్రి అనే డైలాగులు చెప్పడంతో వెంటనే నాగార్జున అందుకే నిన్ను ఎనిమిదిమంది నామినేట్ చేసింది అంటూ అతని పై కౌంటర్ వేస్తాడు.
ఇక హమీద కిరీటం పెడుతూ అసలు హమీద హౌస్లో లేనట్టే ఉంది ఇంట్లో కేవలం 14 మంది ఉన్నట్టున్నారు అంటూ మాట్లాడగా.. అసలు హౌస్ లో నువ్వు గేమ్ ఆడుతున్నావా అంటూ షన్ను పై సెటైర్ వేస్తుంది. నేను ఏం గేమ్ ఆడుతున్నానో ఆడియన్స్ కి తెలుసు అంటూ షణ్ముఖ్ సెటైర్ వేసాడు. ఈ క్రమంలోనే నాగార్జున మాట్లాడుతూ షణ్ముఖ్ పచ్చిమిర్చి తిన్నప్పటి నుంచి మార్పు వచ్చింది. అలాగే ఎనిమిది మంది నామినేట్ చేశాక ఆటలో మరింత మార్పు వచ్చింది అంటూ నాగార్జున షన్ను పై సెటైర్లు వేశారు.
షణ్ముఖ విషయంలో నాగార్జున సపోర్ట్ చేస్తూనే శ్రీరామ్ గురించి, హౌస్ మేట్స్ గురించి షణ్ముఖ్ చేసిన కామెంట్స్ అన్నింటినీ నాగార్జున అలాగే వదిలేశారు. ఇలా షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్ లు వేసినప్పటికీ అతను మాత్రం మార్పు లేకుండా ఆడటంతో నెటిజన్లు నాగార్జున ఇచ్చిన సరిపోలేదా అంటూ షణ్ముఖ్ పై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…