మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గురించి గత కొద్దిరోజుల నుంచి ఇండస్ట్రీలో తారాస్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి ప్యానల్ గురించి మరొకరు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీ మా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్నికల కేంద్రానికి చేరుకొని తమ ఓటును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికలలో భాగంగా మెగాస్టార్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి సీనియర్ హీరోలు కూడా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాత్రి ఎన్నికల ఓటింగ్ జరగగా మా అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణు గెలుపొందడం మనకు తెలిసిందే. ఈ ఎన్నికల ఓటింగ్ సమయంలో పాల్గొన్న పూనమ్ కౌర్ ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా సరే వారి రాజకీయ లబ్ది కోసం మూవీ ఆర్టిస్ట్ సభ్యులను ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలి. మా ఎన్నికలను రాజకీయపరంగా చూడకూడదని ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.
ఇక ఎన్నికల ముందు వరకు పూనమ్ కౌర్ ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతూ ప్రకాష్ రాజ్ గెలిస్తేనే అసోసియేషన్ బాగుంటుందనీ, ఆయన గెలిచిన వెంటనే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను,తాను ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెడతానని పూనమ్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఎన్నికల అనంతరం ఈమెమా ఎన్నికలను రాజకీయాలతో ముడి పెట్టకండి అంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…